Navjot Singh Sidhu: కాంగ్రెస్ నేత సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1988లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి గురువారం ఈ తీర్పు వెలువరించింది.

Navjot Singh Sidhu: కాంగ్రెస్ నేత సిద్ధూకు ఏడాది జైలు శిక్ష

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1988లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి గురువారం ఈ తీర్పు వెలువరించింది. 1988, డిసెంబర్ 27న సిద్ధూ, సంధు అనే వ్యక్తితో కలిసి పాటియాలాలో జిప్సీలో వెళ్తుండగా, గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి కారులో అదే దారిలో వెళ్లాడు. ఆ సమయంలో జిప్సీ రోడ్డుకు అడ్డుగా ఉండటంతో, దాన్ని తొలగించాల్సిందిగా సిద్ధూను, సంధూను కోరాడు. దీంతో వాళ్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో సిద్ధూ, గుర్నామ్ సింగ్ తలపై కొట్టడంతో ఆయన మరణించాడు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం

ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. అప్పట్నుంచి కేసు విచారణ జరుగుతూ వస్తోంది. గతంలో సిద్ధూకు, సంధుకు ఈ కేసులో శిక్ష పడినా, వాళ్లు పై కోర్టుకు వెళ్లడంతో శిక్ష నుంచి తప్పించుకున్నారు. చివరగా కోర్టు సిద్ధూకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేనందున, సిద్ధూను దోషిగా తేల్చలేమని చెప్పింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా బాధితుడి కుటుంబ సభ్యులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో 2018 నుంచి మరోసారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు తాజగా, సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.