Maa Election: నా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు..! నరేష్, కళ్యాణిలపై నటి హేమ ఫిర్యాదు

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు సమయం దగ్గర పడేకొద్దీ మహా రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైనా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే..

Maa Election: నా ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్నారు..! నరేష్, కళ్యాణిలపై నటి హేమ ఫిర్యాదు

Maa Election

Maa Election: తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు సమయం దగ్గర పడేకొద్దీ మహా రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులైనా ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా వారికి చేతనైన రేంజిలో ఓట్లు దండుకునేపనిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎలాంటి సంబంధం లేని ఈ ఎన్నికలు మూడు మీడియా మీట్లు.. ఆరు విమర్శలు అన్న చందంగా రసవత్తరంగా సాగుతున్నాయి.

Dasara Films: పండగ పెద్దదే.. కానీ సందడి లేని స్టార్ హీరోలు!

కాగా.. మంగళవారం ప్రకాష్ రాజ్ పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రెస్ మీట్ పెడితే.. ఓడిపోతామనే భయంతో మొసలి కన్నీరు కారుస్తున్నారని మంచు విష్ణు కౌంటర్ వ్యాఖ్యలు చేశాడు. కాగా.. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి పోటీచేసిన నటి హేమ.. ప్రస్తుతం మా అధ్యక్షుడు నరేష్, సభ్యురాలు కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. తనను అసభ్యకరంగా మాట్లాడుతూ నరేష్, కళ్యాణి ఓ వీడియో విడుదల చేశారని.. హేమ ఫిర్యాదులో పేర్కొంది.

Ajith: నా చావుకి కారణం అజితే.. హీరో ఇంటి ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం!

ఎన్నికల అధికారికి ఓ లేఖ రాసిన హేమ.. నరేష్, కళ్యాణి ఎన్నికలను టార్గెట్ చేస్తూ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, తనను అసభ్యకరంగా చిత్రీకరించేలా మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారని పేర్కొంది. ఈ వీడియోలను కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారని.. గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయని.. ఇప్పుడు మళ్ళీ అదే తరహా ప్రచారం చేస్తున్నారని.. ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్‌ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా.. నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉందని.. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని కోరుతున్నానని.. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉండగా.. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హేమ కోరింది. తనపై నరేశ్‌, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించాల్సిందిగా ఆయా యూట్యూబ్‌ యాజమాన్యాల పైనా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ పేర్కొంది.