Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.. పేర్లు మారినా.. కాన్సెప్ట్ లు మారినా ఇతర దేశాలలో కూడా ఈ షోకు భారీ ఆదరణ ఉంటుంది. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం..

Big Boss 5: ఎలిమినేషన్‌లో తొమ్మిదిమంది.. డేంజర్ జోన్‌లో ఇద్దరు!

Big Boss 5

Big Boss 5: ప్రపంచంలోనే అతిపెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్.. పేర్లు మారినా.. కాన్సెప్ట్ లు మారినా ఇతర దేశాలలో కూడా ఈ షోకు భారీ ఆదరణ ఉంటుంది. ఈ షోలో కంటెస్టెంట్లను ఎప్పుడూ వెంటాడే గండం ఎలిమినేషన్స్ లో నామినేషన్స్‌. ఈ నామినేషన్లో దొరకకుండా హౌస్ మేట్స్ తో పరస్పర అవగాహనతో ఆడగలిన వాళ్ళు ఎలిమినేషన్ ప్రక్రియకు వెళ్ళరు. ఒక్కసారి నామినేషన్స్ లో ఇరుక్కున్నవాళ్లు వారమంతా బిక్కుబిక్కుమంటూ టెన్షన్‌తోనే గడపాల్సి వస్తుంది.

Big Boss 5: ప్రోమోల్లో క్రియేటివిటీ.. షోలో కనిపించడం లేదా?

కాగా, ఐదవ సీజన్ లో హౌస్‌లోకి వెళ్లిన 19 మంది కంటెస్టెంట్లలో నాలుగు వారాలు నలుగురిని బయటకి పంపేశాడు బిగ్ బాస్. ఇప్పుడు ఐదవ వారం నడుస్తుంది. ఈ వారం తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. ఇందులో అనూహ్యంగా షణ్ముఖ్ కూడా నామినేట్ అయ్యాడు. నాలుగు వారాలు ఈ నామినేషన్ లో లేని షణ్ముఖ్ ఈ వారం రావడంతో ఆసక్తిగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ కు షణ్ముఖ్‌, రవి, హమీదా, లోబో, మానస్‌, సన్నీ, ప్రియ, విశ్వ, జెస్సీ నామినేట్‌ అయ్యారు.

Big Boss 5: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కారణాలివే..

అయితే.. వీరిలో ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. తొమ్మిది మందిలో ఇద్దరు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. విశ్వ, జెస్సీ ఈ వారం ఎలిమినేట్ అయిన వారిలో డేంజర్ జోన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందులో కూడా విశ్వ బాగా వెనుకంజలో ఉన్నాడు. విశ్వకు ఓట్లు బాగా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వ మొదటి రెండు వారలలో బాగానే కనిపించినా రానురాను డల్ అయినట్లు తెలుస్తోంది.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

ఇప్పటికే హోస్ట్ నాగార్జున సైతం ఇదే విషయాన్ని విశ్వతో చెప్పాడు. కానీ.. అతనిలో మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. విశ్వ, జెస్సీ మధ్య ఎలిమినేషన్ లో పోటీ జరుగుతున్నట్లుగా తెలుస్తుండగా వీరిద్దరి మధ్య పోరాటం కూడా గట్టిగానే ఉంది. మరి వీరిలో ఎవరు బయటికి వెళ్తారు.. అనూహ్యంగా మిగతా ఏడుగురిలో ఎవరైనా ఇంటి నుండి పంపిస్తారా అన్నది చూడాల్సి ఉంది.