Big Boss 5: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కారణాలివే..

టీఆర్పీ రేటింగులు.. వాడీ వేడీ ఎపిసోడ్స్ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నా బిగ్ బాస్ జోష్ ఏ మాత్రం తగ్గడం లేదు. వారాలకి వారాలు గడిచిపోతూనే ఉంది. బిగ్ బాస్ ఈ సీజన్ ఇప్పటికే నాలుగు వారాలు..

Big Boss 5: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ కారణాలివే..

Big Boss 5

Big Boss 5: టీఆర్పీ రేటింగులు.. వాడీ వేడీ ఎపిసోడ్స్ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నా బిగ్ బాస్ జోష్ ఏ మాత్రం తగ్గడం లేదు. వారాలకి వారాలు గడిచిపోతూనే ఉంది. బిగ్ బాస్ ఈ సీజన్ ఇప్పటికే నాలుగు వారాలు పూర్తిచేసుకుంది. 19 మందితో మొదలైన ఈ ఇంటి ప్రయాణంలో ఇప్పటికే నలుగురు వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా ప్రస్తుతం ఇంట్లో 15 మంది మిగిలారు. తొలి మూడు వారాలలో సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా నాలుగో వారం మేల్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

Big Boss 5: ఈ వారం నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేట్ అయ్యేది ఇతనే?

నటరాజ్ ఎలిమినేట్ అవుతారని రెండు రోజుల ముందు నుండే సోషల్ మీడియాలో లీకైంది. ఆదివారం ఎలిమినేషన్ ఎపిసోడ్ టీవీలో ప్రసారం కాగా.. దానికి శనివారమే షూట్ చేస్తారు. అలా శనివారమే నటరాజ్ ఎలిమినేట్ అయ్యాడని ముందే లీకైంది. బిగ్ బాస్ యాజమాన్యం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఈ లీకుల బెడద వీడడం లేదు. నిజానికి నటరాజ్ ఎలిమినేషన్ ను ముందే కొంత మంది ప్రెడిక్ట్ చేయగా.. అందుకు తగ్గట్లే షో యాజమాన్యం కూడా ఎలిమినేషన్ పూర్తిచేసింది. అయితే.. నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ వెనకున్న కారణాలపై కూడా విశ్లేషణలు షరామామూలే.

Bigg Boss 5: నటరాజ్ అవుట్.. రొమాన్స్‌లో మునిగి తేలిన పింకీ, విశ్వ

షో తొలి మూడు వారాలలో ఎలిమినేట్ అయిన ముగ్గురు కూడా ఆడవాళ్లే కావడంతో నాలుగో వారం మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయక తప్పలేదని తెలుస్తుంది. దీనికి తోడు నాలుగో వారం నామినేట్ అయిన ఎనిమిది మందిలో నటరాజ్, అనీ ఓటింగ్ లో డేంజర్ జోన్లో ఉండగా ఫైనల్ గా నటరాజ్ ని బయటకి పంపారు. హౌస్ లో నటరాజ్ బిహేవియర్ కూడా ఎలిమినేషన్ కి ఒక కారణంగా తెలుస్తుంది. మిగతా కంటెస్టెంట్లను జంతువులతో పోలుస్తూ నటరాజ్ మాస్టర్ చేసే కామెంట్స్ నెగిటివిటీ తేవడంతో ఫైనల్ గా హౌస్ నుండి బయటకి వచ్చే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తుంది.

Naga Chaitanya-Samantha: భరించలేని బాధ.. ఆ నొప్పేంటో తనకు తెలుసన్న ప్రకాష్ రాజ్!

తొలుత షోలోకి ఎంతో సీరియస్‌గా అడుగుపెట్టిన నటరాజ్ రానురాను జోకర్‌గా మారిపోయాడు. వింత బిహేవియర్‌ వల్ల కమెడియన్‌గా మారిపోయాడు. నేను మోనార్క్‌ను, నా మాటే అందరూ వినాలి, కానీ నేనెవరి మాటా వినను అన్నట్లుగా ప్రవర్తిస్తూ కంటెస్టెంట్లతో పాటు ఇటు జనాలకు కూడా విసుగు పుట్టించాడు. పైగా నేను సింహాన్ని.. పులితో వేట, నాతో ఆట రెండూ ప్రమాదమే అంటూ డైలాగులు, కథలు చెప్పడం కాస్త అతిగా అనిపించగా.. మిగతా కంటెస్టెంట్లు రివర్స్ పంచ్ లు వేసి పరువు తీసేశారు. చివరికి ఇంట్లో తనని ఎవరూ పట్టించుకోకపోయినా అందరూ తననే టార్గెట్ చేశారని అతని ఫీలింగ్ కూడా ప్రేక్షకులకు అవసరం లేదేమో అనిపించినట్లుగా చర్చ జరుగుతుంది.