T20 World Cup 2022: సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్‌కు 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన న్యూజిలాండ్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. 8 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రద స్కోరు చేయగలిగింది.

T20 World Cup 2022: సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్‌కు 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించిన న్యూజిలాండ్

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచులో భాగంగా ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచులో పాకిస్థాన్ కు న్యూజిలాండ్ 153 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్‌ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే. 8 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఒత్తిడిలోనూ అద్భుతంగా రాణించడంతో ఆ జట్టు గౌరవప్రద స్కోరు చేయగలిగింది.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ లో ఫిన్ అలెన్ 4, డివోన్ కాన్వే 21, కానె విలియమ్సన్ 46, గ్లెన్ ఫిలిప్స్ 6, దరిల్ మిచెల్ 53, జేమ్స్ నీషం 16 పరుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 2, మొహమ్మద్ నవాజ్ 1 వికెట్ తీశారు. నేటి మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. రేపు సెమీఫైనలో ఇంగ్లండ్ తో టీమిండియా తలపడనుంది. ఫైనల్ మ్యాచు ఈ నెల 13న జరగనుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..