Nikhat Zareen: మరిన్ని విజయాలు సాధిస్తా: నిఖత్ జరీన్ Nikhat Zareen recieves grand welcome

Nikhat Zareen: మరిన్ని విజయాలు సాధిస్తా: నిఖత్ జరీన్

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు నిఖత్ జరీన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Nikhat Zareen: మరిన్ని విజయాలు సాధిస్తా: నిఖత్ జరీన్

Nikhat Zareen: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వంగా ఉందన్నారు నిఖత్ జరీన్. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం అనంతరం తొలిసారి హైదరాబాద్ వచ్చిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఘన స్వాగతం లభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, కుటుంబ సభ్యులు, అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

Aryan Khan: డ్రగ్స్ కేసు.. ఆర్యన్ ఖాన్‌కు క్లీన్‌చిట్

ఈ సందర్భంగా నిఖత్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘‘నాకు ఇంతటి ప్రోత్సాహం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం కామన్‌వెల్త్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్నాను. రాబోయే రోజుల్లో ఒలింపిక్స్‌లో కూడా రాణిస్తా. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తా’’ అని నిఖత్ వ్యాఖ్యానించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు.

×