Super Computer: ఇండియాలోని 9విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు

ఇండియాలోని 9 విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు రానున్నాయి. హై పవర్‌డ్ కంప్యూటింగ్ లో మనమూ ముందుండాలనే దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది.

Super Computer: ఇండియాలోని 9విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు

Super Computers

Super Computer: ఇండియాలోని 9 విద్యాసంస్థలకు సూపర్ కంప్యూటర్లు రానున్నాయి. హై పవర్‌డ్ కంప్యూటింగ్ లో మనమూ ముందుండాలనే దిశగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మినిష్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ హై పర్ఫామెన్స్ కంప్యూటింగ్ తో వందల విద్యా సంస్థలకు, రీసెర్చర్లకు, విద్యార్థులకు అత్యుత్తమ సేవలు అందించనుంది.

సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ ఏర్పాటు చేయడం ద్వారా రీసెర్చ్ కెపాసిటీలను విస్తరించనున్నారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో భాగంగా కొత్త సౌకర్యాలను అందజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

‘నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌తో హై పవర్ కంప్యూటింగ్‌లో ఇండియా ఫ్రంట్ రన్నర్ గా కొనసాగుతుంది. ఇప్పటికే సూపర్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 10విద్యాసంస్థల్లో ఇన్‌స్టాల్ చేశాం. IITs, IISc, IISER పూణె, JNCASR బెంగళూరు, అనేక C-DACలు, NABI మొహాలీలలోని రీసెర్చర్లు బెనిఫిట్ పొందుతారు’ అని మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ లో పేర్కొంది.

Read Also : 10వేల ఏళ్ల వరకు ఇదే సూపర్ కంప్యూటర్ 

ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పట్నా, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ, ఇంటర్-యూనివర్సిటీ యాక్సిలేటర్ సెంటర్ (ఐయూఏసీ) ఢిల్లీ, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడీఏసీ) పూణె, ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్, నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ (ఎన్సీఆర్ఏ)పూణె, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఢిల్లీలలో వీటిని ఏర్పాటు చేస్తారు.