NIT Warangal: పీహెచ్‌డీ సీట్లు పెంచిన నిట్ వరంగల్

ప్రస్తుత ఏడాది నుంచి నిట్ వరంగల్ క్యాంపస్ లో పీహెచ్ డీ సీట్లను పెంచనున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే 150 నుంచి 200 వరకూ పెంచనున్నామని అధికారులు తెలిపారు.

NIT Warangal: పీహెచ్‌డీ సీట్లు పెంచిన నిట్ వరంగల్

Nitw

NIT Warangal: ప్రస్తుత ఏడాది నుంచి నిట్ వరంగల్ క్యాంపస్ లో పీహెచ్ డీ సీట్లను పెంచనున్నారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే 150 నుంచి 200 వరకూ పెంచనున్నామని అధికారులు తెలిపారు. ఈ మేరకు NITW డైరక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణా రావు ప్రకటన జారీ చేశారు. మొత్తం 13 డిపార్ట్ మెంట్లలో ఫుల్ టైం, పార్ట్ టైం మోడ్స్ లో జాయిన్ అవ్వాలనుకునే వీలుందని తెలిపారు.

సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెటలార్జికల్ అండ్ మెటేరియల్స్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మాథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంల్ లో మొత్తం 50సీట్లు పెంచారు.

పీహెచ్‌డీ ఫుల్ టైం ప్రోగ్రాంలో భాగంగా జాయిన్ అవ్వాలనుకునే వారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రూల్స్ ప్రకారం అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : పాడి పశువుల్లో పాల జ్వరం… నివారణ