Viral Letter : మ్యారేజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారు..నేను లవ్ ఎఫైర్‌లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా : తేజస్వి యాదవ్‌కు యువతి లేఖ

మ్యారేజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారు..నేను మాత్రం లవ్ ఎఫైర్‌లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా దీని కారణం మీరే..మీ ప్రభుత్వమే అంటూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు ఓ యువతి రాసి లేఖ వైరల్ గా మారింది.

Viral Letter : మ్యారేజ్ చేసుకుని మీరు హ్యాపీగా ఉన్నారు..నేను లవ్ ఎఫైర్‌లో ఉండే వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నా : తేజస్వి యాదవ్‌కు యువతి లేఖ

Tejashwi Yadav Viral Letter

Tejashwi Yadav Viral Letter : మీరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు. నేను మాత్రం లవ్ ఎఫైర్ లో ఉండాల్సి వయస్సులో కరెంట్ ఎఫైర్స్ చదువుతున్నాను దానికి కారణం మీరే..మీ ప్రభుత్వమే అంటూ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు ఓ యువతి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేనో వ్యక్తిని ప్రేమించాను..వాలెంటైన్స్ డే దగ్గరపడుతోంది..నేను అతనికి లవ్ ప్రపోజ్ చేయాలంటే నా నిరుద్యోగం అడ్డంగా ఉంది అంటూ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు పాట్నాకు చెందిన పింకీ అనే యువతి లేఖ రాసింది.

బీహార్ లో చాలా కాలంలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయటానికి ఆసక్తి చూపించటంలేదు. దీంతో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు మానసికంగా కృంగిపోతున్నారు. ఉద్యోగం వారి వారి వివాహాలకు అడ్డంగా ఉందనే అర్థం వచ్చేలా పింకీ అనే యువతి ఆవేదన చెందుతు నా ప్రేమను వ్యక్తపరచటానికి నా నిరుద్యోగం ఆటంకంగా మారింది అని లేఖ రాసింది.

కొన్ని సంవత్సరాలుగా నేను టీవీ డైలీ సోప్ ఒపెరా స్క్రీన్ రైటర్, బనారస్ వాలా ఇష్క్ రచయిత ప్రభాత్ బంధుల్యను ప్రేమిస్తున్నానని పింకీ లేఖలో వెల్లడించింది. తన నిరుద్యోగ స్థితి కారణంగా వాలెంటైన్స్ డే రోజున ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని..ఉద్యోగం వస్తే నా ప్రేమను ఆయనకు తెలియజేయాలని ఆశపడుతున్నా..కానీ నా ఆశ నెరవేరటంలేదు నా ప్రేమను నిరుద్యోగం వల్ల వ్యక్తపరచలేకపోతున్నానంటూ వాపోయింది.ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడకపోవడంతో తన కోరిక నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. నోటిఫికేషన్ వెలువడినా అది లీకవుతుండడంతో పరీక్షలు జరగడం లేదని..నాలాంటి వారు ఎదురుచూడడం తప్ప మరేమీ చేయలేకపోతున్నారంటూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను తన లెటర్ ద్వారా డైరెక్ట్ గా డిప్యూటీ సీఎంకే లేఖ రాసింది.

నేను పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నాను..మా నాన్న నా పెళ్లి చేయాలని తపన పడుతున్నారు. ఉద్యోగం లేకపోతే నా ప్రేమను వ్యక్తపరచలేను..మా నాన్న నా పెళ్లి వేరే వ్యక్తితో చేసేస్తారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నా ప్రేమను దక్కించుకోలేనేమోనని ఆందోళన కలుగుతోంది.కోపం వస్తోంది. ఎన్నో ఆశలతో ఈ ఉత్తరం రాస్తున్నాను. అర్థం చేసుకోండీ అంటూ లేఖలో పేర్కొంది పింకీ. దయచేసి నాకు ఉద్యోగం రావటానికి హాయం చేయండి, లేకపోతే నేను ప్రేమించిన ప్రభాత్ మరొకరితో పెళ్లి చేసుకుంటాడు. నాకు ఉద్యోగం లేకపోతే ప్రేమతో ఏం చేస్తాను? ఇట్లు మీ ఓటరు మరియు రచయిత..ప్రభాత్ బంధుల్య వన్ సైడ్ లవర్ పింకీ (పాట్నా నుండి)” అని ఆమె లేఖను ముగించింది.