Month Salary : నెల తిరగకుండానే..జీతం అయిపోతోంది..సర్వేలో ఆసక్తికర విషయాలు

నెల పూర్తికాకుండానే.. జీతాలు అయిపోతున్నాయని, దాదాపు 80 శాతం మంది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాలు హరతి కర్పూరంలా అయిపోతోందని ఓ సర్వే వెల్లడించింది.

Month Salary : నెల తిరగకుండానే..జీతం అయిపోతోంది..సర్వేలో ఆసక్తికర విషయాలు

Salary

No Spend Month  : నెల…మొదటి తారీఖు ఎప్పుడు వస్తుందా ? అని ఎదురు చూస్తున్నారు. తీరా డబ్బులు చేతిలో పడ్డాక…నెల తిరక్కుండానే ఖర్చయిపోతున్నాయి. దీంతో చాలా మంది అప్పులు, రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణమంటున్నారు నిపుణులు. పెరుగుతున్న ధరలు..ఇతరత్రా ఖర్చులతో డబ్బులు నిల్వ చేసుకోలేకపోతున్నారని వెల్లడిస్తున్నారు. తాజాగా…నెల పూర్తికాకుండానే.. జీతాలు అయిపోతున్నాయని, దాదాపు 80 శాతం మంది వైట్ కాలర్ ఉద్యోగుల జీతాలు హరతి కర్పూరంలా అయిపోతోందని ఓ సర్వే వెల్లడించింది. ఇందులో మూడోవంతు మంది జీతాలు నెలలో సగం రోజులు గడవకుండానే ఖర్చవుతోందని, ఉద్యోగులు నెల చివరి వరకు నగదును నిల్వ చేసుకోలేకపోతున్నారని తెలిపింది.

Read More : Cab Driver :  క్యాబ్‌ డ్రైవర్‌ చెంప చెళ్లుమనిపించిన మహిళ

ఈ సర్వేలో తక్కువ జీతం తీసుకొనే ఎంప్లాయిస్ నే కాకుండా..రూ. లక్షకు పైగా జీతం తీసుకుంటున్న వారిని సైతం ప్రశ్నించారు. ఈ సర్వేను కన్సల్టింగ్ సంస్థ ఈవై, స్టార్టప్ రిఫైన్ లు సంయుక్తంగా ఎర్నడ్ వేజ్ యాక్సెస్ మోడల్ పై సర్వే నిర్వహించారు. భయాలు, నాసిరకం ఫైనాన్షియల్ ప్లానింగ్, రుణాలలో చిక్కుకోవడం వంటి కారణాలతో జీతం నెల చివరి వరకు నిల్వ చేసుకోలేకపోతున్నట్లు తేలిందని నివేదిక తెలిపింది. జులై – ఆగస్టు మధ్యలో 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న వారిని సర్వేలో ప్రశ్నించారు. దాదాపు 3010 మందిని విషయాలు అడిగి తెలుసుకున్నారు.

Read More : Lockup Death : 20 ఏళ్లలో 1,888 మంది లాకప్‌డెత్

14 శాతం మంది జీతాలు నెల మొదట్లోనే అయిపోతుండగా..20 శాతం మందికి నెల మధ్య వరకు డబ్బు నిల్వ ఉంటుందని..47 శాతం మంది జీతం ఖర్చయిపోయి.. నెల చివరిలో డబ్బు కోసం తీవ్ర కష్టాలు పడుతున్నట్లు తేలింది. భారత్ లో అత్యధిక వేతనిలు పొందే ఐటీ సెక్టార్ లోని ఉద్యోగుల జీతాలు కూడా నెలాఖరు వరకు నిలవడం లేదని చెప్పడం గమనార్హం. ఈడబ్ల్యూఏ (రోజు వారి జీతం వంటిది) విధానంలో జీతాలు తీసుకోవడానికి చాలా తక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపినట్లు, దీని గురించ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పడం జరిగిందని వెల్లడించింది.