Covid-19 Telangana : తెలంగాణలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ ఉండదు

2021, మే 01వ తేదీ శనివారం, మే 02వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండదని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

Covid-19 Telangana : తెలంగాణలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ ఉండదు

Telangana

Telangana : కరోనా సెకండ్ వేగంగా విస్తరిస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటోది. వైరస్ కు చెక్ పెట్టడానికి జరుగుతున్న వ్యాక్సిన్ ప్రక్రియలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. వ్యాక్సిన్ ల కొరత పలు రాష్ట్రాలను వేధిస్తున్నాయి.

మే 01వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల వయస్సున్న వారికి కూడా వ్యాక్సిన్ వేస్తామని కేంద్రం ప్రకటించిన పలు రాష్ట్రాల్లో డోసులు సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నిలిపివేస్తున్నాయి. తాజాగా..తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియికు తాత్కాలికంగా బ్రేక్ లు పడ్డాయి.

2021, మే 01వ తేదీ శనివారం, మే 02వ తేదీ ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉండదని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు. టోకా డోసుల కొరత వల్ల ప్రభుత్వ సెంటర్లలో వ్యాక్సినేషన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతున్నాయి. తొలి రెండు దశల్లో ఫ్రంట్​ లైన్​ వారియర్స్​, 45 ఏళ్ల పైబడిన వారికి వాక్సిన్​ ఇచ్చిన ప్రభుత్వం.. మే 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌లు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రైవేటు ఆస్పత్రులకు పంపిణీ నిలిపివేయాలని రాష్ట్రంలోని డీఎంహెచ్‌వోలకు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా. శ్రీనివాస్‌ ఆదేశించారు.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ 2021, ఏప్రిల్ 30 శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. మరో 53 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 5వేల 926 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

Read More : Land grabs in Medak : భూ దందా ఆరోపణలు కట్టుకథలు – ఈటల