Non Veg Pani Puri : వారెవ్వా.. చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పానీపూరీ ..
నాన్ వెజ్ పానీ పూరీ ట్రెండ్ అవుతోంది. నాన్ వెజ్ పూరీ అమ్ముతు నా రూటే సెపరేటు అంటున్నాడో వ్యాపారి. మీకిష్టమైన నాన్ వెజ్ టేస్ట్ లో నోరూరించే పానీపూరీ.

Non Veg Pani Puri
Non Veg Pani Puri : పానీపూరీ.ఈ పేరు వింటేనే నోరు ఊరిపోతుంది. రోడ్ల పక్కన పానీపూరీ బండి కనిపిస్తే అడుగు ముందుకు పడదు.నాలుగు పూరీలో నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. చక్కగా లొట్టలేసుకుంటో నోటి నిండా పానీపూరీ పెట్టుకుంటా అబ్బా..స్వర్గం నోట్లోనే ఉందనిపిస్తుంది. బంగాళాదుంపలు, బఠానీలు కలిపి చేసిన మిశ్రమాన్ని పూరీలో పెట్టి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన నీటితో నింపి పానీ పూరీలు తయారు చేస్తుంటారు.
పానీ పూరీలో వెజ్ అనటంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ తాజాగా నాన్ వెజ్ పానీ పూరీ (non veg pani puri) ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో నాన్ వెజ్ పూరీ అమ్ముతున్నాడు ఓ వ్యాపారి.చికెన్, మటన్,చేపలు, రొయ్యలతో తయారు చేసిన పానీపూరీలు అమ్ముతు తనకంటూ ఓ స్పెషల్ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు పశ్చిమ బెంగాల్ (West bengal)కు చెందిన ఓ పానీ పూరీ వ్యాపారి.
పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ నాన్ వెజ్ పానీ పూరీలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. చికెన్ పానీపూరీ (Chicken Panipuri), మటన్ పానీ పూరీ (Mutton Panipuri), రొయ్యల పానీపూరీ(Prawn Panipuri), వేట్కీ ఫిష్ పానీపూరీ (Vetki Fish Panipuri)వెరైటీలు ఉన్నాయి. దీని మెనూకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రితుపర్ణ ఛటర్జీ (@మసాలాబాయి) అనే యూజర్ దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేశారు.ఈ సరికొత్త పానీపూరీలపై నెటిజన్లు అంతకంటే వెరైటీగా స్పందిస్తున్నారు. ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయిరా బాబూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గోల్గప్పాలు కూడా నాన్ వెజ్ అవుతాయని మనం ఊహించి ఉండం అంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.