RRR: ఎన్టీఆర్-చరణ్ డామినేషన్ వార్.. నోళ్లు మూయించిన ఆన్సర్!

సక్సెస్ సంబరాల్లో రామ్ చరణ్, తారక్ మునిగి తేలుతున్నారు. హైదరాబాద్ టు ముంబై ఫుల్ జోష్ చూపిస్తున్నారు. అయితే ఎక్కడికెళ్లినా ఓ తలనొప్పి మాత్రం ఇద్దరినీ వదలట్లేదు.

RRR: ఎన్టీఆర్-చరణ్ డామినేషన్ వార్.. నోళ్లు మూయించిన ఆన్సర్!

RRR

RRR: సక్సెస్ సంబరాల్లో రామ్ చరణ్, తారక్ మునిగి తేలుతున్నారు. హైదరాబాద్ టు ముంబై ఫుల్ జోష్ చూపిస్తున్నారు. అయితే ఎక్కడికెళ్లినా ఓ తలనొప్పి మాత్రం ఇద్దరినీ వదలట్లేదు. సో ఈ నెగటివ్ చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్న చరణ్.. ఒక్క ఆన్సర్ ఇచ్చి వదిలించుకున్నారు. ఏంటా ఇర్రిటేట్ క్వశ్చన్.. రామ్ చరణ్, రామారావ్ రియాక్షన్ ఎలా ఉంది.

RRR: ఆర్ఆర్ఆర్ రెండు వారాల కలెక్షన్స్.. ఆ ఫీట్ కొట్టేనా..?

ట్రిపుల్ ఆర్ హిట్ కొట్టింది.. సెలెబ్రేషన్స్, థౌసండ్ క్రోర్ సక్సెస్ సంబరాలను కూడా చేసుకుంటుంది. భీమ్ గా తారక్.. రామ్ గా చరణ్ నటనకు నేషనల్ ఆడియెన్స్ ఫిదాఅయ్యారు. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఓ టాపిక్ మాత్రం ప్రతిచోటా ట్రిగ్గర్ అవుతూనే ఉంది. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ రోల్ ను ఎలివేట్ చేశారని.. చరణ్ షోను స్టీల్ చేశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి తారక్ ని ప్రేమతో హెచ్చరిస్తున్నారు కూడా.

RRR: అన్‌స్టాపబుల్ కలెక్షన్లు.. ఇండియన్ సినిమా అడ్రెస్ మార్చేస్తున్న ఆర్ఆర్ఆర్!

రీసెంట్ గా ముంబైలో ఇలాంటి డామినేట్ క్వశ్చనే రామ్ చరణ్ కి ఎదురైంది. అయితే.. ఒక్క క్షణం కూడా అలా అనుకోనని.. డామినేషన్ అనే పదాన్ని తాను నమ్మను అసలందులో నిజం లేదని స్పష్టం చేశారు చరణ్. తారక్ తో కలిసి పని చేసిన ప్రతి క్షణాన్ని గుర్తుంచుకుంటానని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న తారక్ కూడా పాజిటివ్ గానే రియాక్టయ్యారు. ఇంకో అడుగు ముందుకు వేసి ఈ ఇద్దరు స్టార్స్ కూడా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ తీస్తే.. అందులో నటించడానికి సిద్ధమన్నారు. నిజానికి కాస్త పవర్ఫుల్ గా అనిపించడంతో చరణ్ రోల్ డామినేట్ చేసినట్టు అనిపించింది కానీ.. ఇద్దరూ యాక్షన్ పరంగా, స్క్రీన్ స్పేస్ పరంగా సమానంగానే కనిపించారనేది కొందరి వాదన. ఏదేమైనా రామ్ చరణ్ ఆన్సర్ తో ఇద్దరి మధ్య ఎలాంటి ఇష్యూ లేదన్నది మాత్రం తేలిపోయింది.