RRR: ఆర్ఆర్ఆర్ రెండు వారాల కలెక్షన్స్.. ఆ ఫీట్ కొట్టేనా..?

ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాహుబలి లాంటి సెన్సేషనల్ మూవీ తరువాత స్టార్.....

RRR: ఆర్ఆర్ఆర్ రెండు వారాల కలెక్షన్స్.. ఆ ఫీట్ కొట్టేనా..?

Rrr Worldwide Two Weeks Collections

RRR: ఆర్ఆర్ఆర్.. రిలీజ్‌కు ముందు ఈ సినిమా దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలను క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాహుబలి లాంటి సెన్సేషనల్ మూవీ తరువాత స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

RRR: అన్‌స్టాపబుల్ కలెక్షన్లు.. ఇండియన్ సినిమా అడ్రెస్ మార్చేస్తున్న ఆర్ఆర్ఆర్!

ఈ చిత్రానికి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం తండోపతండాలుగా థియేటర్లకు వెళ్లారు. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి మలిచిన తీరు అత్యద్భుతంగా ఉండటంతో ఈ సినిమాకు అభిమానులు నీరాజనం పలికారు. ఇక ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించగా, పలు కొత్త రికార్డులను తన పేరిట వేసుకుంటూ దూసుకుపోతుంది ఆర్ఆర్ఆర్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు పూర్తయినా, బాక్సాఫీస్ వద్ద ఇంకా పంజా విసురుతోంది.

RRR: ఆర్ఆర్ఆర్ 12 రోజుల వసూళ్లు.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో!

కేవలం దక్షిణాదినే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆర్ఆర్ఆర్ ట్రెమెండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా రెండు వారాలు పూర్తి చేసుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.535.21 కోట్ల కళ్లుచెదిరే వసూళ్లను రాబట్టింది. అటు గ్రాస్ పరంగా ఈ మూవీ ఏకంగా రూ.967 కోట్లతో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తూ వెళ్తోంది. మరో వారం పాటు ఎలాంటి బడా సినిమాలు లేకపోవడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.వెయ్యి కోట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఎప్పుడు అందుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం రెండు వారాల థియేట్రికల్ రన్‌లో ఏరియాలవారీగా రాబట్టిన వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – రూ.103.15 కోట్లు
సీడెడ్ – రూ.47.41 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.32.20 కోట్లు
ఈస్ట్ – రూ.14.71 కోట్లు
వెస్ట్ – రూ.12.24 కోట్లు
గుంటూరు – రూ.16.98 కోట్లు
కృష్ణా – రూ.13.58 కోట్లు
నెల్లూరు – రూ.8.49 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.248.76 కోట్లు(షేర్) (రూ.374 కోట్లు గ్రాస్)
కర్ణాటక – రూ.39.80 కోట్లు
తమిళనాడు – రూ.35.90 కోట్లు
కేరళ – రూ.9.90 కోట్లు
హిందీ – రూ.102.10 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – రూ.8.00 కోట్లు
ఓవర్సీస్ – రూ.91.25 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – రూ.535.21 (షేర్) (రూ.967 కోట్లు గ్రాస్)