NTR : ఆస్కార్‌కి ‘RRR’ని ఎంపిక చేయకపోవడంలో రాజకీయం.. ఎన్టీఆర్ సమాధానం!

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. తాజాగా ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెరైటీ.. ఎన్టీఆర్ అండ్ చరణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో.. RRR భారతదేశం తరుపు నుంచి ఎందుకు ఆస్కార్ కి ఎంపిక కాలేదు? ఆ విషయంలో ఏమన్నా రాజకీయం జరిగిందా? అన్న ప్రశ్నలు..

NTR : ఆస్కార్‌కి ‘RRR’ని ఎంపిక చేయకపోవడంలో రాజకీయం.. ఎన్టీఆర్ సమాధానం!

NTR : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియన్స్‌ని, సినీ సాంకేతిక నిపుణులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాదు అంతర్జాతీయ అవార్డు వేదికల్లో కూడా ఈ సినిమా చోటు దక్కించుకుంటుంది. ఇక ఆస్కార్ తరువాత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ ‘నాటు నాటు’ సాంగ్ కి గాను అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

NTR : వెరైటీ మ్యాగజైన్ విలేకరికి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసిన ఎన్టీఆర్..

తాజాగా ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెరైటీ.. ఎన్టీఆర్ అండ్ చరణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో.. RRR భారతదేశం తరుపు నుంచి ఎందుకు ఆస్కార్ కి ఎంపిక కాలేదు? ఆ విషయంలో ఏమన్నా రాజకీయం జరిగిందా? అన్న సంచలన ప్రశ్నలు అడిగారు. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. భారతదేశం నుంచి ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ కి ఎంపిక చేయడంలో రాజకీయాలు జరిగాయా? లేదా? అనే దాని గురించి నేను మాట్లాడాను. ఈ సినిమాని ఎంపిక చేయాలనేది సెలక్షన్ ప్యానల్ లో ఉన్న సభ్యులకి బాగా తెలుసు అని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ఎప్పుడు ఉన్నతం గానే వ్యవహరిస్తారు.

అయినా ఆర్ఆర్ఆర్ ని ఇండియన్ గవర్నమెంట్ ఆస్కార్ కి ఎందుకు ఎంపిక చేయలేదు అనేది నాకు అనవసరం. ఎందుకంటే RRR ఇప్పటికే చాలా సాధించి మమ్మల్ని గర్వపడేలా చేసింది అంటూ వెల్లడించాడు. అలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడం గురించి మాట్లాడుతూ.. ప్రతిసారి ఫ్యామిలీ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అమెరికా వస్తుంటాము. కానీ ఈసారి అవార్డు అందుకోడానికి ఇక్కడికి వచ్చాము. నాకు చాలా గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యానించాడు.