యంగ్ టైగర్‌తో ‘ఉప్పెన’ బుచ్చి బాబు

యంగ్ టైగర్‌తో ‘ఉప్పెన’ బుచ్చి బాబు

NTR – Buchi Babu: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’ తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చి బాబు సానాల క్రేజీ కాంబినేషన్‌లో, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది.

తన మొదటి సినిమాను లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన బుచ్చి బాబు, రెండో చిత్రాన్ని డిఫరెంట్ జానర్‌లో రూపొందించనున్నాడు.
విశాఖపట్నం నేపథ్యంలో పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది మైత్రీ మూవీస్.

ప్రస్తుతం ‘ఉప్పెన’ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న బుచ్చి బాబు ఇటీవలే నిర్మాతలకు లైన్ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నారట. త్వరలో పూర్తి వెర్షన్ కథ రెడీ చేయనున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తన 30వ సినిమాని త్రివిక్రమ్‌తో చెయ్యనున్నాడు తారక్. ఆ తర్వాత మైత్రీ సంస్థలోనే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా ఉంది. దాని తర్వాత బుచ్చి బాబు సినిమా స్టార్ట్ కానుంది. ఎన్టీఆర్ నటించే 32వ సినిమా ఇది.