Omega 3 Fatty Acids : శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌..

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంత ఉపయోగమంటే..

Omega 3 Fatty Acids : శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌..

Omega 3 Foods (1)

Omega 3 Fatty Acids Benefits : ఇప్పుడంతా బిజీ బిజీ లైఫ్. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఎవరి హడావిడి వారిది. పెరుగుతున్న ఒత్తిడి. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వెరసి ఊబకాయాలు, అనారోగ్య సమస్యలు. కానీ ఆరోగ్యంగా ఉంటేనే కదా..ఏపని అయినా చేసుకోగలం. పనులు పూర్తి అవ్వాలనే ఆందోళనతో ఆరోగ్యాలు కోల్పోతున్నాం. దీంతో 40ఏళ్లు రాకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నాం.

కాస్త సమయం, కొంచెం శ్రద్ధ వహిస్తే శరీరక ఆరోగ్యంతో పాటు మానసకి ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. దాని కోసం మనం రోజువారీ తీసుకునే ఆహారాల్లో ‘ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌’ ఉండేలా చేసుకోవటమే దీనికి పరిష్కారం. ఒమేగా 3 మన శరీరానికి ఎంత అవసరమో అది లేకపోతే ఎన్ని సమస్యలు వస్తాయో శరీరం బాగా పనిచేయాలంటే  ఒమేగా చాలా అవసరం. మనం తినే ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. దాన్నే సమతుల ఆహారం అంటారు. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు శరీరానికి చాలా చాలా అవసరం. శరీరం బాగా పనిచేయాలంటే ఈ ఒమేగా 3 పోషకం చాలా అవసరం.ఇది ఏఏ ఆహారాల్లో ఉంటుందో తెలుసుకుందాం..

మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి మన గుండె నుంచి పునరుత్పత్తి వరకు దాదాపు అన్ని అవయవాలకు చాలా అవసరం. ఇవి మన శరీరంలో అనేక కణ నిర్మాణాలకు కలిగి వుంటున్నందున.. వీటిని మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి అసవరం ఎంతైనా ఉంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను చేపలు, గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, కోడిగుడ్డు, వాల్‌నట్స్‌, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్‌ ఆయిల్‌, అవకాడో,చియా గింజలు,పిస్తా,చేపల్లో టూనా చేపలు,సాల్మన్ చేపలు, మెర్రింగ్, వంటి వాటిలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం ప్రతీరోజు తినాలి. నాన్ వెజ్ తిననివారు ఒమేగా 3 కోసం గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, వాల్‌నట్స్‌, బ్రొకోలి, కొత్తిమీర, అవిసె గింజలు, ఆలీవ్‌ ఆయిల్‌, అవకాడోలతో పాటు ఇతర ఆహారాలు తీసుకోవాలి.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉపయోగాలేమంటే..
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా డిప్రెషన్‌, ఆందోళన తగ్గుతాయనీ నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా కంటి చూపును మెరుగుపర్చడంలో ఒమేగా పనితీరు అద్భుతంగా ఉంటుంది. అంతేనా..ఒమేగా 3 వల్ల హైబీపీని తగ్గుతుంది. బీపీ సరైనస్థాయిలో ఉండేలా చేస్తుంది. అలాగే ప్రస్తుతం చాలా చాలా ప్రమాదకారిగా మారుతున్న డయాబెటిస్‌ ను కంట్రోల్ చేయటంతో ఒమేగా చాలా ఉపయోగపడుతుంది. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్ లో ఉంచుతుంది. సో బీపీ, షుగర్ కంట్రోల్ లో ఉంచాలి అంటే ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్‌ చాలా చాలా అవసరం. అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే వృద్ధాప్యంలో ఆల్జీమర్స్‌ సమస్య రాకుండా ఉంటుంది. లివర్‌లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.

రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు ఉపశమనం
ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూన్‌ వ్యాధిని తగ్గించడంలో ఒమేగా 3 అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందుల ప్రభావాన్ని మెరుగుపరచడమే కాకుండా, చేప నూనె వంటి కొన్ని సప్లిమెంట్లు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

ట్రైగ్లిజరైడ్ స్థాయిలను క్రమబద్ధం చేస్తుంది..
ఫిష్ ఆయిల్ వంటి కొన్ని ఒమేగా 3 అధికంగా ఉండే ఆహారాలు ట్రైగ్లిజరైడ్ లేదా శరీరంలో రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో చాలా సహాయంగా ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా పనిచేయటానికి ఉపయోగపడతాయి. గుండె పనితీరు మెరుగుపడితే శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు ట్రైగ్లిజరైడ్స్ చెడు చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉండే ఆహారాలు, సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల గుండెను చక్కటి ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

మానసిక వ్యాధుల ప్రమాదానికి ఒమేగా చెక్
మెదడును చురుకుగా ఉంచడానికి ఒమేగా 3 చాలా అవసరం. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక రుగ్మత (డిప్రెషన్)లను తగ్గిస్తుంది. మన జీవితంలో పలు రకాలుగా వచ్చే మానసిక అరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఫిష్ ఆయిల్, ఇతర ఒమేగా 3 ఆహారాలు.. కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి. చక్కటి శక్తినిస్తాయి. శరీరానికి శక్తిని అందించడానికి, వ్యాయామ సమయాన్ని పెంచటానికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి.

వర్క్‌అవుట్‌ ఎక్కువ సేపు చేసినా అలసిపోకుండా ఒమేగా పనిచేస్తుంది. గర్భం దాల్చిన మహిళలకు కడుపులో బిడ్డ ఆరోగ్యంగా, బలంగా పెరగటానికి ఒమేగా చక్కటి ఆహారం. గర్బిణులు తమ ఆహారంలో అన్ని రకాల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. గర్భిణులు ఒమేగా 3 తీసుకోవటం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం చక్కగా ఉండటంతో పాటు బిడ్డకూడా చక్కటి ఆరోగ్యంగా జన్మిస్తుంది.