Oscar Best Picture Nominations : ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కి నామినేట్ అయిన 10 సినిమాలు ఇవే.. ఎక్కడ చూడొచ్చు??

ఈ సంవత్సరం ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కేటగిరిలో 10 సినిమాలు నామినేట్ అయ్యాయి. ఈ పది సినిమాల్లోంచి ఒకదానికి బెస్ట్ పిక్చర్ అవార్డును ఇవ్వనున్నారు. బెస్ట్ పిక్చర్ విభాగంలో ఆస్కార్ నామినేట్ అయిన పది సినిమాలు ఇవే.............

Oscar Best Picture Nominations : ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కి నామినేట్ అయిన 10 సినిమాలు ఇవే.. ఎక్కడ చూడొచ్చు??

Oscar Best Picture Nominated movies

Oscar Best Picture Nominations :  సినిమా వాళ్లంతా వేచి చూసిన ఆస్కార్ నామినేషన్స్ మంగళవారం నాడు ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని సినీ పరిశ్రమలు ఈ నామినేషన్స్ కోసం ఎదురుచూశాయి. ఈ సారి మన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుండటంతో ఇండియన్ సినీ ప్రేక్షకులంతా ఈ నామినేషన్స్ లో RRR సినిమా ఉండాలని కోరుకున్నారు. కనీసం ఒక మూడు లేదా నాలుగు విభాగాల్లో ఈ సినిమా నిలుస్తుంది అనుకున్నారు. అయితే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట మాత్రమే ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం కేటగిరీలలో కూడా RRR నిలవకపోవడంతో అభిమానులు కొంత నిరాశ చెందారు.

ఈ సంవత్సరం ఆస్కార్ బెస్ట్ పిక్చర్ కేటగిరిలో 10 సినిమాలు నామినేట్ అయ్యాయి. ఈ పది సినిమాల్లోంచి ఒకదానికి బెస్ట్ పిక్చర్ అవార్డును ఇవ్వనున్నారు. బెస్ట్ పిక్చర్ విభాగంలో ఆస్కార్ నామినేట్ అయిన పది సినిమాలు ఇవే..

All Quiet on the Western Front – యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన జర్మనీ సినిమా ఇది. ఎడ్వార్డ్ బెర్గెర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

Avatar: The Way of Water – ఈ సినిమా గురించి మన అందరికి తెలిసిందే. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో అవతార్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా ఇది. ప్రస్తుతం ఇంకా థియేట్రికల్ రన్ లో ఉంది.

The Banshees of Inisherin – ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన డార్క్ కామెడీ సినిమా. అమెజాన్ లో ఈ సినిమాని చూడొచ్చు.

Elvis – అమెరికా రాక్ సింగర్, నటుడు అయిన ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని అమెజాన్ లో చూడొచ్చు.

Everything Everywhere All at Once – మల్టీవర్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్ లో చూడొచ్చు. అలాగే VUDUలో కూడా చూడొచ్చు. ఈ సినిమా అత్యధికంగా ఈ సారి 11 నామినేషన్స్ గెలుచుకుంది.

The Fabelmans – వరల్డ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన స్టీవెన్ స్పిల్‌బర్గ్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఓ 16 ఏళ్ళ కుర్రాడు సినిమా మేకింగ్ తో ప్రేమలో పడే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని అమెజాన్, VUDUలో చూడొచ్చు.

Tár – టాడ్ ఫీల్డ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక మహిళా సంగీత దర్శకురాలు, సైకాలజీ డ్రామాకి సంబంధించినది. ఈ సినిమాని అమెజాన్, VUDUలో చూడొచ్చు.

Top Gun: Maverick – మన అందరికి తెలిసిన టామ్ క్రూజ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే కొన్నినెలల క్రితం రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాని అమెజాన్, పారామౌంట్ ప్లస్, VUDUలో చూడొచ్చు.

Triangle of Sadness – ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ జంటకి రిచ్ గా అబ్రాడ్ వెళ్లే ఆఫర్స్ వస్తే జరిగే పరిణామాలపై, ఆ ట్రావెలింగ్ పై తీసిన సినిమా ఇది. ఈ సినిమాని అమెజాన్, VUDUలో చూడొచ్చు.

Women Talking – ఒక సంఘంలోని కొంతమంది మహిళలు ఆ సంఘంలో జరిగే సెక్సువల్ వయోలెన్స్ పై పోరాడే కథాంశమే ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా ఎక్కడా స్ట్రీమ్ అవ్వట్లేదు. త్వరలో అమెజాన్, ఆపిల్ టీవీలోకి వస్తుంది.