నెవ్వర్ బిఫోర్ : రాజకుమారి ‘కిరీటం’తో పెళ్లికూతురు డెకరేషన్ సూపర్..

నెవ్వర్ బిఫోర్ : రాజకుమారి ‘కిరీటం’తో పెళ్లికూతురు డెకరేషన్ సూపర్..

ఈ కరోనా కాలంలో పెళ్లిళ్లు ఆర్భాటంగా జరుపుకోకపోయినా..ఫోటో షూటులు మాత్రం గ్రాండ్ గా డిఫరెంట్ గా చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఐడియాలతో ఫోటో షూట్ లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వెరీ వెరీ స్పెషల్ గా ఉండేలా వెడ్డింగ్ షూట్ లు హల్ చల్ చేస్తున్నాయి. అటువంటి ఓ వెడ్డింగ్ షూట్ లో ఓ పెళ్లికూతురు నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా ముస్తామైంది..

పాకిస్తాన్‌ వాజ్మా వెడ్డింగ్ షూట్ లో తన డ్రెస్సింగ్ నుంచి అలంకరణ వరకూ చాలా చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంది. అందమైన పువ్వులు, లతల ఎంబ్రాయిడరీ చేసిన గ్రాండ్‌ డ్రెస్‌ ధరించింది. చెవులకు పెద్ద పెద్ద జూకాలు, పాపిట్లో వెడల్పాటి మాంగ్‌ టిక్కా ఆభరణాల అలంకరణా అంతే గ్రాండ్‌గా ఉంది.

 

వీటితోపాటు ఆమె తలపై ధరించిన కిరీటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె ధరించిన కిరీటం విశేషంగా ఆకట్టుకుంటోంది. వాజ్మా వెడ్డింగ్ షూట్ లో ఫొటోలు తీసినా నటాషా జుబైర్‌ సోషల్‌ మీడియాలో ఈ ప్రత్యేక ఫొటోలను షేర్‌ చేయటంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వాజ్మా పెళ్లి దుస్తులు కూడా వెరీ డిఫరెంట్ గా ఉన్నాయి. అలాగే..మెహెందీ వేడుకకు పెళ్లికూతురు వాజ్మా అచ్చంగా బొమ్మలా ముస్తాబైంది. ఈ ముస్తాబులో ప్రత్యేక ఆకర్షణీయమైన ‘కిరీటం’తో సందడి చేసింది.

తెలుపు, ఎరుపు గులాబీలతో కురులను ముచ్చటగొలిపే అందంగా అలంకరించింది. ఆమె డ్రెస్సింగ్‌ మొత్తం చైనీస్, ఇండోనేషియా డ్రెడిషన్ తో ముస్తాబైంది. తల ఆభరణాలను మాత్రం కస్టమైజ్‌ చేసింది.

ఈ వెడ్డింగ్ ఫోటో షూట్ చేసిన నటాషా జుబైర్ మాట్లాడుతూ.. ‘నేను పెళ్లికూతుళ్ల ఫొటోలు ఎన్నో తీశాను..ఎన్నో ఫోటో షూట్ కు తీశాను. వారి స్పెషల్ గా డిజైన చేయించుకున్న డ్రెస్‌లు చూశాను. అవన్నీ ఒకేలా ఉంటే..వాజ్మా పెళ్ళి డ్రెస్సింగ్..డెకరేషన్ వెరీ వెరీ స్పెషల్ అని పొగిడేశాడు.