Bro Movie : ‘బ్రో’ టికెట్స్ రిలీజ్.. అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్.. గంటలో 10 వేలకు పైగా టికెట్లు..

జులై 28న సినిమా రిలీజ్ అయినా పెద్ద సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ముందుగానే టికెట్ బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ చేశారు. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుండటంతో టికెట్స్ ఓపెన్ చేయగానే.....

Bro Movie : ‘బ్రో’ టికెట్స్ రిలీజ్.. అదిరిపోతున్న అడ్వాన్స్ బుకింగ్స్.. గంటలో 10 వేలకు పైగా టికెట్లు..

Pawan Kalyan Sai Dharam Tej Bro Movie Advance Bookings Open

Updated On : July 26, 2023 / 12:02 PM IST

Bro Movie Bookings :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించింది. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. బ్రో సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించారు.

జులై 28న సినిమా రిలీజ్ అయినా పెద్ద సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ముందుగానే టికెట్ బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ చేశారు. పవన్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తుండటంతో టికెట్స్ ఓపెన్ చేయగానే గంటలోనే బుక్ మై షో యాప్ లో ఏకంగా పదివేల టికెట్స్ అమ్ముడయ్యాయి. రెండు రోజుల ముందే ఇలా టికెట్స్ అంతా అమ్ముడుపోతుండటంతో నిర్మాణ సంస్థతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Kanguva : ‘కంగువ’లో రెండు కథలు.. గ్లింప్స్‌లో చూసింది ఫ్లాష్ బ్యాక్ మాత్రమే..

అయితే బ్రో సినిమాకు ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు ఉండవని, టికెట్స్ రేట్ల పెంపు కూడా సపరేట్ గా ఉండదని, పెద్ద సినిమాలకు ఉండే రేటే ఉంటుందని గతంలోనే నిర్మాతలు చెప్పారు. దీంతో బ్రో టికెట్స్ ఓపెన్ చేయగానే అమ్ముడయిపోతున్నాయి. మరి అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి బెన్ఫిట్ లు, ప్రీమియర్ లు వేస్తారేమో చూడాలి .