Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

ప్రముఖ కన్నడ నటుడు పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్ను మూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌

Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!

Puneeth Rajkumar

Puneeth Rajkumar: ప్రముఖ కన్నడ నటుడు పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్ను మూశారు. ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిమ్‌ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తుండగా తుది శ్వాస విడిచారు. పునీత్ అస్వస్థత విషయం తెలియగానే అభిమానులు భారీగా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. కర్ణాటక సీఎం బొమ్మై కూడా హాస్పిటల్ కి వచ్చి పునీత్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు.

Puneeth Rajkumar : పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్‌కు గుండెపోటు.. అభిమానుల్లో ఆందోళన..

పునీత్ రాజ్‌కుమార్‌ ఒకప్పటి కన్నడ సూపర్ స్టార్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కన్నడ కంఠీవర రాజ్‌కుమార్‌ మూడో కొడుకు. పెద్దన్నయ్య శివ రాజ్ కుమార్ కన్నడలో సూపర్‌స్టార్. రెండో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ నిర్మాతగా కొనసాగుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా నటనలో ప్రవేశించి కన్నడ పవర్ స్టార్ గా ఎదిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా 1976 లోనే సినిమాల్లోకి ప్రవేశించాడు పునీత్ రాజ్‌కుమార్‌. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 14 సినిమాల్లో నటించాడు. హీరోగా అప్పు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకి మన పూరి జగన్నాధ్ డైరెక్టర్. తెలుగు ఇడియట్ సినిమా అప్పు సినిమా ఒకేసారి తెరకెక్కించారు. అప్పు సినిమా భారీ విజయం సాధించి కన్నడలో గ్రాండ్ గా లాంచ్ అయ్యాడు పునీత్ రాజ్‌కుమార్‌.

RRR Movie : ఇకపై పివి’ఆర్ఆర్ఆర్’ థియేటర్స్.. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో పీక్స్

ఇప్పటివరకు దాదాపు 30 కి పైగా సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్నాయి. అభి, వీర కన్నడిగ, మౌర్య, ఆకాష్, అజయ్, అరసు, మిలానా, వంశీ, రామ్, జాకీ, హుడ్గరు, రాజకుమార, అంజనీ పుత్ర లాంటి ఎన్నో సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇటీవల యువరత్న సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ఈ సినిమా తెలుగులో పాఠశాల సినిమాగా రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. మాస్ సినిమాలతో జనాలకి దగ్గరై కర్ణాటకలోనే కాక వేరే రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు.

Mumbai Drug case : బాలీవుడ్‌ను తరలించేందుకు బీజేపీ కుట్ర!

నిర్మాతగా కూడా సినిమాలని నిర్మించిన పునీత్.. స్టార్ హీరోగా మారిన తర్వాత కూడా కన్నడలో తోటి హీరోల సినిమా ఫంక్షన్స్ కి కూడా సపోర్ట్ గా వెళ్లేవారు. ఒక్క కన్నడ బాషా సినిమాలు, అక్కడి హీరోలే కాదు.. వేరే భాషలో హీరోల సినీ ఫంక్షన్స్ కి కూడా వచ్చేవారు. అందరితో స్నేహంగా ఉండేవారు పునీత్. ఇందులో భాగంగానే కొన్ని సినిమాలకి వాయిస్ ఓవర్ అందించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే నేషనల్ అవార్డు అందుకున్న పునీత్.. నాలుగు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డులు, ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.

Allu Arjun-Trivikram : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

పునీత్ మరణంపై ఇండియన్ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. సౌత్ నుండి నార్త్ వరకు సినీ ప్రముఖులంతా ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పునీత్ తో రిలేషన్ నెమరు వేసుకొని విచారం వ్యక్తం చేశారు. పునీత్ తండ్రి రాజ్ కుమార్ తో దాదాపు అన్ని సినీ పరిశ్రమలకు మంచి సంబంధాలు ఉండడం.. పునీత్ కూడా అన్ని బాషల నటులతో స్నేహంగా మెలగడంతో అన్ని బాషలలో ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. తండ్రి అభిమానులు తమ బిడ్డను కోల్పోయిన భావనలో పునీత్ చికిత్స పొందిన ఆసుపత్రి వద్ద రోదనలు మిన్నంటుతున్నాయి.