Allu Arjun-Trivikram : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

వీళ్లందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'అల వైకుంఠపురంలో'. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిపారు. అయితే అది కొత్త కథా? లేక 'అల వైకుంఠపురంలో' సినిమాకి సీక్వెలా అని

Allu Arjun-Trivikram : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నాలుగోసారి.. ‘అల వైకుంఠపురంలో’ సీక్వెల్??

Trivikram

Allu Arjun-Trivikram :  త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ హిట్ కాంబో. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘జులాయి’ మంచి విజయం సాధించింది. ఆ ఆతరవాత వచ్చిన ‘సన్ అఫ్ సత్యమూర్తి’ క్లాసీ హిట్ గా నిలిచింది. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచి భారీ విజయం సాధించింది. దీంతో హ్యాట్రిక్ సాధించారు త్రివిక్రమ్ అల్లు అర్జున్. ఈ సినిమా సక్సెస్ మీట్ లోనే అల్లు అర్జున్ తో మరో సినిమా చేస్తాను అని ప్రకటించారు త్రివిక్రమ్. తాజాగా త్రివిక్రమ్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చేసారు.

Ajay Bhupathi : ప్రేక్షకులకి క్షమాపణలు చెప్పిన ‘ఆర్‌ఎక్స్‌ 100’ డైరెక్టర్

ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్, అల్లు అర్జున్, తమన్, ప్రొడ్యూసర్ నాగ వంశీ కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోని వంశీ ట్విట్టర్ లో షేర్ చేసి.. త్వరలో ఒక సర్‌ప్రైజ్‌ రానుంది అంటూ పోస్ట్ చేసి ‘అల వైకుంఠపురంలో’ సినిమా నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ని ట్యాగ్ చేశారు. వీళ్లందరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిపారు. అయితే అది కొత్త కథా? లేక ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి సీక్వెలా అని తెలియాల్సి ఉంది.

Shanmukh Jaswanth : షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నా పని అయిపోయింది అన్న షన్ను

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘పుష్ప’ తర్వాత బోయపాటితో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు అయిన తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ఈ కాంబో వరుసగా నాలుగో విజయం కూడా సాధించడానికి రెడీ అయిపోయారు. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.