Formula Racing : ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ పై గందరగోళం

ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చాయి. ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు.

Formula Racing : ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ పై గందరగోళం

racing

Formula Racing : ఫార్ములా ఈ రేసింగ్ ట్రాక్ మీద గందరగోళం ఏర్పడింది. ఒక్కసారిగా ట్రాక్ మీదకు ప్రజల వాహనాలు వచ్చాయి. ట్రాక్ మీదకు నార్మల్ వాహనాలు ఎలా వచ్చాయని రేసింగ్ నిర్వాహకులు టెన్షన్ పడుతున్నారు. ట్రాక్ పైకి సాధారణ ప్రజల వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్ పైకి ప్రజల వాహనాలు రావడంతో మొదటి ప్రాక్టీస్ రేసు ఆలస్యం అవుతోంది.

ఫిబ్రవరి 11 నుంచి ఫార్ములా-ఈ కార్ రేస్ ప్రారంభం కానుంది. ఫార్ములా-1, ఫార్ములా-ఈ కార్ రేస్ కు తేడాలు ఉన్నాయి. ఫార్ములా-1 కోసం హైబ్రిడ్ టర్బో-ఛార్జర్డ్ ఇంజన్ల రేసింగ్ కార్లు వాడతారు. ఫార్ములా-ఈ కోసం బ్యాటరీ ఆధారిత, పర్యావరణ సహిత ఎలక్ట్రిక్‌ రేసింగ్ కార్లను వినియోగిస్తారు. గత ఎనిమిది సీజన్లలో ఫార్ములా-ఈకి మంచి స్పందన రావడంతో అదే ఉత్సాహంతో ఈ సారి హైదరాబాద్ లో దీన్ని నిర్వహిస్తున్నారు.

‘Reverse Gear Auto Race’ : మహారాష్ట్రలో ‘రివర్స్ గేర్ ఆటో రేస్’..చూస్తే మామూలుగా లేదుగా..

ఫార్ములా-1 రేస్ కు 2011–2013లో ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధా నగర్ జిల్లాలో యమున ఎక్స్ ప్రెస్ వే ప్రాంతంలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పేరుతో అప్పట్లో ఆ రేస్ జరిగింది. పదేళ్ల తర్వాత ఇటువంటి ప్రపంచ స్థాయి రేస్ హైదరాబాద్ లో జరుగుతుంది. అయితే, అప్పట్లో భారత్ లో జరిగింది ఫార్ములా-1 రేస్. ఇప్పుడు జరుగుతుంది ఫార్ములా-ఈ రేస్. దీంతో భారత్ లో మొదటిసారిగా ఫార్ములా-ఈ కార్ రేస్ జరుగుతున్న నగరంగా హైదరాబాద్‌ నిలిచింది.