Prabhas Srinu : ప్రభాస్ శ్రీనుకు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రభాస్ తో ఎక్కడ పరిచయం? వాళ్లిద్దరూ మరీ అంత క్లోజా??

ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. నేను సరిగ్గా చదువుకోలేదు, సినిమాల్లోనే ఆసక్తి. మా నాన్న, శరత్ బాబు గారు స్నేహితులు కావడంతో ఆయనకు చెప్తే ముందు యాక్టింగ్ నేర్పించామన్నారు.

Prabhas Srinu : ప్రభాస్ శ్రీనుకు ఆ పేరు ఎలా వచ్చింది? ప్రభాస్ తో ఎక్కడ పరిచయం? వాళ్లిద్దరూ మరీ అంత క్లోజా??

Prabhas Srinu revealed story about his name and bonding with Prabhas

Updated On : June 13, 2023 / 7:17 AM IST

Prabhas : నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీను(Prabhas Srinu) ఒకప్పుడు వరుసగా సినిమాలు చేశారు. ఆల్మోస్ట్ ప్రభాస్ తో పాటే శ్రీను ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు అయింది. ఇప్పటికే 300 పైగా సినిమాలు చేశాడు ప్రభాస్ శ్రీను. చాలా మందికి అతన్ని ప్రభాస్ శ్రీను అని ఎందుకు పిలుస్తారు? వారిద్దరి మధ్య పరిచయం ఎలా అయింది? ఒక స్టార్ హీరో రేంజ్ ప్రభాస్ శ్రీనుతో అంత క్లోజ్ ఎలా అయ్యారు అని ప్రశ్నలు వస్తాయి. తాజాగా ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలని పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.

 

ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. నేను సరిగ్గా చదువుకోలేదు, సినిమాల్లోనే ఆసక్తి. మా నాన్న, శరత్ బాబు గారు స్నేహితులు కావడంతో ఆయనకు చెప్తే ముందు యాక్టింగ్ నేర్పించామన్నారు. అలా నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాను. ప్రభాస్ కూడా అప్పుడే సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. మేమిద్దరం ఒకటే బ్యాచ్. ప్రభాస్ నాకు అక్కడే పరిచయం. ప్రభాస్ ని, ఆ బ్యాచ్ ని నేను ఎక్కువగా నవ్విస్తు ఉండేవాడిని. అలా కొద్దిగా క్లోజ్ అయ్యాం అని తెలిపారు.

Manoj Bajpayee : సెన్సార్ వస్తే ఓటీటీ చచ్చిపోతుంది.. మనోజ్ బాజ్‌పాయ్‌ వ్యాఖ్యలు..

తనకి ప్రభాస్ శ్రీను పేరు గురించి మాట్లాడుతూ.. ఒక సినిమా చేశాక నాకు అవకాశాలు ఏం రాలేదు. దాంతో ప్రభాస్ తన దగ్గరికి వచ్చేయమన్నాడు. కొన్ని రోజులు ప్రభాస్ కి అసిస్టెంట్ గా పనిచేస్తూనే అవకాశాల కోసం ట్రై చేశాను. ప్రభాస్ తో వర్షం సినిమాలో చేశాక మంచి గుర్తింపు వచ్చి వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆ సమయంలో ఇండస్ట్రీలో ఎక్కువమంది శ్రీనులు ఉండేసరికి నేను ప్రభాస్ దగ్గర ఉంటున్నానని ప్రభాస్ శ్రీను అని పిలిచేవారు. ఇంక అదే అలవాటైపోయింది అందరికి. ఆ తర్వాత కూడా ప్రభాస్ తో అనేక సినిమాలు పనిచేశాను. నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్. నేను ప్రభాస్ తోనే అన్ని షేర్ చేసుకుంటాను. ప్రభాస్ కి కోపం వస్తే నేనొక్కడ్నే నవ్వించగలను. దాంతో మరింత క్లోజ్ అయ్యాం. కృష్ణంరాజు గారు ప్రభాస్ రాజు అయితే నన్ను మంత్రి అనేవారు అని ప్రభాస్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపాడు.