presidential elections: రాష్ట్రప‌తి ఎన్నిక‌లో పార్టీల‌ మ‌ద్ద‌తు కోసం జేపీ న‌డ్డా, రాజ్‌నాథ్ ప్ర‌య‌త్నాలు

రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌ద్ద‌తు అడిగేందుకు దేశంలోని రాజ‌కీయ‌ పార్టీల‌తో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌నున్నారు.

presidential elections: రాష్ట్రప‌తి ఎన్నిక‌లో పార్టీల‌ మ‌ద్ద‌తు కోసం జేపీ న‌డ్డా, రాజ్‌నాథ్ ప్ర‌య‌త్నాలు

J.p.nadda

presidential elections: రాష్ట్రప‌తి ఎన్నిక‌లో మ‌ద్ద‌తు అడిగేందుకు దేశంలోని రాజ‌కీయ‌ పార్టీల‌తో బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌నున్నారు. ఈ విష‌యాన్ని బీజేపీ ఆదివారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎన్డీఏలో ఉన్న పార్టీల‌తో పాటు యూపీఏలోని కాంగ్రెసేత‌ర పార్టీల‌తోనూ జేపీ న‌డ్డా, రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడ‌నున్నారు. అలాగే, రెండు కూట‌ముల్లోలేని పార్టీలు, స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌తోనూ వారు సంప్ర‌దింపులు జ‌రుపుతారు. త్వ‌రలోనే జేడీ న‌డ్డా, రాజ్‌నాథ్ ఈ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెడ‌తార‌ని బీజేపీ పేర్కొంది.

prophet row: ప్ర‌ధాని మోదీ మౌనం వీడాలి: శ‌శి థ‌రూర్

రాష్ట్రపతి ఎన్నికకు జూన్ 29న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఎన్నిక జూలై 18న జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో విప‌క్ష పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెట్టేందుకు కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్ కూడా ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాయి. ఈ విష‌యంపై చ‌ర్చించేందుకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో స‌మావేశానికి రావాల‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌హా 22 మంది విప‌క్ష పార్టీల‌ నేతలకు ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ లేఖలు రాశారు.