PV Sindhu : స్వర్ణ పతకంపై గురి, క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన సింధు

ఒలింపిక్స్ స్వర్ణ పతకంపై గురిపెట్టిన భారత స్టార్ షట్లర్ ప్రపంచ చాంపియన్ పి.వి.సింధు లక్ష్యం దిశగా దూసుకెళుతున్నారు. ఊహించనట్టే...మహిళల సింగిల్స్ గ్రూప్ జేలో ఆమెకు ఎదురు లేకుండా పోయింది.

PV Sindhu : స్వర్ణ పతకంపై గురి, క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన సింధు

Sindhu

Tokyo Olympics 2020 India : ఒలింపిక్స్ స్వర్ణ పతకంపై గురిపెట్టిన భారత స్టార్ షట్లర్ ప్రపంచ చాంపియన్ పి.వి.సింధు లక్ష్యం దిశగా దూసుకెళుతున్నారు. ఊహించనట్టే…మహిళల సింగిల్స్ గ్రూప్ జేలో ఆమెకు ఎదురు లేకుండా పోయింది. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ లో అగ్రస్థానంలో కొనసాగిన..ఆమె..ప్రీక్వార్టర్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా..క్వార్టర్స్ కు దూసుకెళ్లారు సింధు. ప్రీక్వార్టర్ లో డెన్మార్క్ క్రీడాకారిణి బ్లిక్ ఫెల్ట్ పై గెలుపొందారు. 21-15, 21-13 తేడాతో బ్లిక్ ఫెల్ట్ ను చిత్తు చేశారు. మూడు విజయాలతో గ్రూప్ -జెలో సింధు అగ్రస్థానంలో నిలిచారు.

Read More : Honey Trap : హానీ ట్రాప్… లేని వ్యాపారం పేరిట లక్షలు వసూలు చేసిన మహిళ

ప్రీక్వార్టర్ లో 12వ ర్యాంకర్ మియా బ్లిక్ ఫెల్ట్ (డెన్మార్క్)..తో సింధు..అయిదుసార్లు పోటీ పడ్డారు. నాలిగింటిలో సింధు నెగ్గగా..ఒక మ్యాచ్ లో మాత్రం బ్లిక్ ఫెల్ట్ గెలిచారు. ఈ ఏడాది ఆరంభంలో థాయ్ లాండ్ ఓపెన్ లో సింధుపై బ్లిక్ ఫెల్ట్ పై చేయి సాధించారు. కేవలం 35 నిమిషాల్లో ఈ పోరు ముగిసింది. చురుకైన వేగం, పదునైన స్ట్రోక్ లతో సింధును ఉక్కిరిబిక్కిరి చేసింది. ర్యాలీ గేమ్ తో ఆట మొదలు పెట్టి బాడీ స్మాష్ తో మ్యాచ్ ను ముగించారు. మధ్యలో స్మాష్ లు, క్రాస్ కోర్టు షాట్ లతో అదరగొట్టారు.

Read More : Multivitamin For Children : మీ పిల్లలకు మ‌ల్టీ విట‌మిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!