సూపర్‌స్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..

సూపర్‌స్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..

Rajinikanth: సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి సంబంధించి ఈ మధ్య ఎటువంటి అప్‌డేట్స్ లేవు. లాస్ట్ ఇయర్ హెల్త్ బాలేక పొలిటికల్ ఎంట్రీ నుండి డ్రాప్ అయ్యారు. ఆ తర్వాత సూపర్ ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాని కూడా పక్కన పెట్టేశారు. ఇలా వరుసగా డిసప్పాయింటింగ్ న్యూస్ వింటున్న ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు రజినీ.

లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో రజినీకి హెల్త్ బాలేకపోవడంతో అటు పొలిటికల్ స్పీడ్‌కి, ఇటు సినిమాల స్పీడ్‌కి బ్రేక్ పడింది. దాంతో ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు . దాదాపు రెండు నెలలనుంచి ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వని రజనీకాంత్.. ఇప్పుడు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.

https://10tv.in/superstar-rajinikanths-annaatthe-will-be-releasing-on-november-4th-2021/

అంతకుముందు అన్నాత్తే మూవీ కోసం రోజుకి 14 గంటలు కష్టపడిన రజనీకాంత్.. హెల్త్ బాలేకపోవడంతో షూటింగ్‌ని కూడా పక్కన పెట్టేశారు. ఇక ఈ సినిమా ఇప్పట్లో ఉండదనుకున్నారు అంతా. అయితే రజనీ ఈ నెలాఖరుకి గానీ వచ్చే నెల మొదటివారంలోగానీ ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొనాలని ప్లాన్ చేస్తున్నారు.

శివ డైరెక్షన్లో భారీ స్టార్ కాస్ట్‌తో తెరకెక్కుతున్న ‘అన్నాత్తే’ మూవీ ని దీపావళి కానుకగా నవంబర్ 4 న రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 40 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీంతో త్వరగా సినిమాని కంప్లీట్ చెయ్యడానికి మళ్లీ రెడీ అవుతున్నారు రజినీ. అంతేకాదు.. ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో యంగ్ డైరెక్టర్‌తో సినిమా చెయ్యడానికి సిద్ధమవుతున్నారు తలైవా. ఇలా లేట్ వయసులో కూడా యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మళ్లీ కమ్ బ్యాక్ అవుతున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్.