Charan Tej : మా నాన్న అలా అవ్వడానికి వాళ్ళే కారణం.. మా కుటుంబాన్ని అల్లరి పాలు చేయకండి.. రాకేష్ మాస్టర్ కొడుకు ఫైర్..
రాకేష్ మాస్టర్ మరణించాక వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని ఇంటర్వ్యూ చేయాలని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన దగ్గరికి వచ్చిన పలు ఛానల్స్ వాళ్ళతో మాట్లాడుతూ చరణ్ తేజ్ ఫైర్ అయ్యాడు.

Rakesh Master son charan tej fires on youtube channels and social media
Rkesh Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు పలు సూపర్ హిట్ సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన రాకేష్ మాస్టర్ గత కొన్నాళ్లుగా మాత్రం యూట్యూబ్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ, ఇష్టమొచ్చింది మాట్లాడుతూ వైరల్ అయ్యారు. ఒకప్పుడు సినిమాలు, షోలతో బిజీగా ఉన్న రాకేష్ మాస్టర్ కొన్నాళ్ల క్రితం మానసికంగా దెబ్బ తిని, మందుకి అలవాటు పడి, హెల్త్ ని పాడు చేసుకున్నారు. రాకేష్ మాస్టర్ ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాడుకొని పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూలు చేసి వైరల్ చేశారు. దీంతో మాస్టర్ బాగా వైరల్ అయ్యారు. ఇప్పుడు అయన మరణించిన తర్వాత కూడా రాకేష్ మాస్టర్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు వైరల్ గా మారాయి.
తాజాగా రాకేష్ మాస్టర్ తనయుడు చరణ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ ఫైర్ అయినట్టు సమాచారం. రాకేష్ మాస్టర్ మరణించాక వాళ్ళ కుటుంబాన్ని, కొడుకుని ఇంటర్వ్యూ చేయాలని పలు యూట్యూబ్ ఛానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన దగ్గరికి వచ్చిన పలు ఛానల్స్ వాళ్ళతో మాట్లాడుతూ చరణ్ తేజ్ ఫైర్ అయ్యాడు.
చరణ్ తేజ్ మాట్లాడుతూ.. మా నాన్న ఇలా అవ్వడానికి ప్రధాన కారణం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి మా నాన్నతో ఇంటర్వ్యూలు చేసి, మా నాన్నని నెగిటివ్ గా చూపించారు. ఇకనైనా అలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయడం ఆపేయండి. ఇప్పటివరకు మా కుటుంబాన్ని అల్లరిపాలు చేసింది చాలు. మా గురించి, మా కష్టాల గురించి ఇంకా వీడియోలు చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. మాపై ఎవరైనా తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాను అంటూ ఫైర్ అయ్యాడు.