Ranbir Kapoor : కూతురు కోసం ఆరు నెలలు సినిమాలకి హాలిడేస్ ఇస్తున్న రణబీర్ కపూర్..
తాజాగా తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాహా పుట్టినప్పటినుంచి సరిగ్గా తనకు టైం కేటాయించట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా..................

Ranbir Kapoor wants to give 6 months break to movies for her daughter
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గత సంవత్సరం బ్రహ్మాస్త్ర సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం రణబీర్ తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రణబీర్, శ్రద్దా కపూర్ కలిసి జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా మార్చ్ 8న రిలీజ్ కానుంది.
రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఓ కూతురికి జన్మనిచ్చాడు. రాహా అని ఆ కూతురికి పేరు పెట్టారు. ప్రస్తుతం అలియా రాహాతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. త్వరలో షూటింగ్స్ లో జాయిన్ అవ్వనుంది. అయితే రణబీర్ కూతురు పుట్టినప్పటినుంచి కూడా షూటింగ్స్, సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.
తాజాగా తూ ఝూతి మైన్ మక్కార్ సినిమా ప్రమోషన్స్ లో రణబీర్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సుదీర్ఘ విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను. రాహా పుట్టినప్పటినుంచి సరిగ్గా తనకు టైం కేటాయించట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది. సందీప్ తో చేసే యానిమల్ షూట్ లో నా పాత్ర షూట్ త్వరలో అయిపోతుంది. ఆ తర్వాత కనీసం ఆరు నెలలు హాలిడే తీసుకుంటాను. ఆరు నెలల వరకు ఎలాంటి సినిమాలు, పని పెట్టుకోను. ఆరు నెలలు నా కూతురు రాహకే కేటాయిస్తాను. తనతో ఉంటే నేను చాలా ఆనందంగా ఉంటాను అని తెలిపాడు. దీంతో త్వరలో రణబీర్ అన్నిటికి గ్యాప్ ఇచ్చి ఇంట్లో కూతురితో టైం గడపబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు గ్యాప్ తీసుకుంటే మళ్ళీ యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో కనపడతాడేమో రణబీర్ అని అనుకుంటున్నారు అభిమానులు.