Citadel : ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ట్రైలర్ రిలీజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇండియాలో కూడా..

స్పై ఏజెన్సీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్. చాలా రోజుల నుంచి తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ సొంతంగా భారీ స్థాయిలో నిర్మిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ట్రైలర్ లో.................

Citadel : ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ ట్రైలర్ రిలీజ్.. రిలీజ్ డేట్ అనౌన్స్.. ఇండియాలో కూడా..

Priyanka chopra Hollywood Citadel series trailer released and series will streaming in amazon prime from April 28th

Citadel :  ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడికి చెక్కేసింది. జోనస్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయి అక్కడే ఉంటూ హాలీవుడ్ సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ప్రియాంకచోప్రా, బాలీవుడ్ నటుడు రిచర్డ్ మాడెన్ ముఖ్యపాత్రలో ఎవెంజర్స్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్.

స్పై ఏజెన్సీ, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్. చాలా రోజుల నుంచి తెరకెక్కుతున్న ఈ సిరీస్ ని అమెజాన్ ప్రైమ్ సొంతంగా భారీ స్థాయిలో నిర్మిస్తుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. మంచులో, కదిలే ట్రైన్ లో కూడా యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా తీశారు. ప్రియాంక చోప్రా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టేసింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్స్ లో ప్రియాంక నటించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్టు ప్రకటించారు. ఇంగ్లీష్ తో పాటు భారతీయ భాషలు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో ఇండియన్ ప్రేక్షకులు కూడా సిటాడెల్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు.

NTR : అమెరికాలో ల్యాండ్ అయిన యంగ్ టైగర్.. కాలిఫోర్నియా నుంచి అదిరిపోయే ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్..

అయితే ఇదే సిటాడెల్ సిరీస్ ని బాలీవుడ్ లో సమంత, వరుణ్ ధావన్ తో ఇండియన్ ప్రేక్షకులకు తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. అయితే ప్రియాంకచోప్రా సిరీస్ ని ఇక్కడ ఇండియాలో కూడా అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సమంత, వరుణ్ ధావన్ తో తెరకెక్కించడం ఎందుకు అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.