Ranji Trophy 2021-22 : కూతురు చనిపోయింది.. బాధను దిగమింగుకుని సెంచరీ చేశాడు, సలామ్ అంటున్న నెటిజన్లు

బరోడా టీంలో విష్ణు సొలంకి ఉన్నాడు. అయితే.. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో విష్ణు సొలంకి కూతురు చనిపోయింది. ఆ సమయంలో ఇతను రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న

Ranji Trophy 2021-22 : కూతురు చనిపోయింది.. బాధను దిగమింగుకుని సెంచరీ చేశాడు, సలామ్ అంటున్న నెటిజన్లు

Ranji Trophy Vishnu Solanki

Vishnu Solanki Loss Newborn Daughter : ఓ వైపు కూతురు చనిపోయింది.. కానీ..ఆట మీద మక్కువ… బాధను దిగమింగుకుని మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. ఏకంగా సెంచరీ బాదాడు. పుట్టిన బిడ్డను కోల్పోయి సెంచరీతో ఔరా అనిపించాడు. ఇతనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంత బాధను దిగమింగి.. ఆటను ఆడావు.. నిజంగా నీ ఆటకు సలామ్ అంటూ నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అతనే బరోడా క్రికెటర్ విష్ణు సోలంకి. రంజీ ట్రోఫి 2022 సీజన్ లో సెంచరీతో మెరిశాడు. చండీఘర్ జట్టుతో బరోడా జట్టు ఢీకొంది.

Read More : MS Dhoni: ధోనీని కలవడంతో నా కల నిజమైంది – పాకిస్తాన్ పేసర్

బరోడా టీంలో విష్ణు సొలంకి ఉన్నాడు. అయితే.. పుట్టిన కొద్ది రోజులకే ఆరోగ్య సమస్యలతో విష్ణు సొలంకి కూతురు చనిపోయింది. ఆ సమయంలో ఇతను రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. విషయం తెలుసుకున్న అతను హుటాహుటిన ఇంటికి బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. చండీఘర్ తో జరిగే మ్యాచ్ లో ఇతను ఆడాల్సి ఉంది. ఆట మీద మక్కువతో బాధనంతా దిగమింగుకుని గ్రౌండ్ లో అడుగుపెట్టాడు. సెంచరీతో అదరగొట్టాడు. ఐదో ప్లేస్ లో వచ్చిన ఇతను 161 బంతులు ఎదుర్కొని 12 బౌండరీలు బాది సెంచరీ సాధించాడు.

Read More : IPL 2022: మార్చి 26 నుంచే ఐపీఎల్

బరోడా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకుముందు చండీఘర్ తొలి ఇన్నింగ్స్ లో 168 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బరోడా తొలి ఇన్నింగ్స్ లో 230 పరుగుల అధిక్యంలో ఉంది. అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు..అంటూ సొలంకిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.