Mirzapur : గుడ్డు భాయ్ వచ్చేస్తున్నాడు.. మీర్జాపూర్ సీజన్ 3 అప్డేట్ ఇచ్చిన బీనా ఆంటీ..
మీర్జాపూర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. సీజన్ 3 నుంచి అదిరే అప్డేట్ ఇచ్చిన బీనా ఆంటీ.

Rasika Dugal gave update on Mirzapur season 3 Pankaj Tripathi Ali Fazal
Mirzapur : ఓటీటీ కంటెంట్స్ బాగా అలవాటు అవ్వడంతో ప్రేక్షకులు ఇప్పుడు పలు వెబ్ సిరీస్ చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ క్రైమ్, ఫ్యామిలీ, కామెడీ.. ఇలా పలు నేపథ్యంలో వెబ్ సిరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే ఎన్ని వచ్చినా ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ కి మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కరణ్ అంశుమాన్, పునీత్ కృష్ణ రూపొందించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2018 లో ఈ సిరీస్ నుంచి మొదటి సీజన్ 9 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయ్యింది.
Samajavaragamana : ‘సామజవరగమన’ కలెక్షన్స్ దూకుడు ఆగేలా లేదు.. ఈ ఏడాది మరో చిన్న సినిమా సంచలనం..
రెండేళ్ల తరువాత 2020 లో సెకండ్ సీజన్ 10 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మూడేళ్ళ నుంచి ఈ సిరీస్ నుంచి మూడో సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ సిరీస్ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సీజన్ 3 నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న రసిక దుగాల్ (Rasika Dugal) తన డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఈ సిరీస్ లో రసిక.. ‘బీనా’ అనే పాత్రలో నటించింది. సోషల్ మీడియాలో నెటిజెన్స్ బీనా ఆంటీ అని కూడా ట్రెండ్ చేస్తుంటారు.
Vijay : పాదయాత్ర మొదలుపెట్టబోతున్న విజయ్.. తమిళనాట వైరల్ అవుతున్న న్యూస్..!
View this post on Instagram
ఇక ఇదే సిరీస్ లో ఫేమస్ అయిన మరికొన్ని పాత్రలు ఏంటంటే.. గుడ్డు, మున్నా క్యారెక్టర్స్. ‘అలీ ఫాజాల్’ గుడ్డు పాత్ర చేయగా, దివ్యేన్దు మున్నా పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా మున్నా భాయ్ క్యారెక్టర్ కి మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఈ పాత్ర సెకండ్ సీజన్ ఎండ్ లో చనిపోయినట్లు చూపించారు. నిజంగానే ఈ పాత్ర చనిపోతుందా? లేదా గుడ్డు భాయ్ కోసం మున్నా భాయ్ బ్రతికి వస్తాడా? అనేది చూడాలి. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ రెండు సీజన్స్ చూడవచ్చు. త్వరలోనే మూడో సీజన్ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేయనున్నారు.