Vijay : పాదయాత్ర మొదలుపెట్టబోతున్న విజయ్.. తమిళనాట వైరల్ అవుతున్న న్యూస్..!
ఇళయదళపతి విజయ్ పాదయాత్ర మొదలుపెట్టబోతున్నాడా..? మంగళవారం నాడు 15 జిల్లాలకు చెందిన ప్రజా సంఘాలతో జరిగిన సమావేశంలో దీని పై..

Vijay
Actor Vijay : ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇన్నాళ్లు సినిమాలు చేస్తూనే అడపాదడపా రాజకీయ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన ఈ హీరో.. ఇప్పుడు ఫుల్ టైం రాజకీయాల్లోకి దిగుతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడు అంటూ గట్టిగా వినిపిస్తుంది. ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ అభిమాన సంఘం ద్వారా ఇన్నాళ్లు సేవాకార్యక్రమాలు చేస్తూ వచ్చిన విజయ్.. గత కొన్ని రోజులుగా ఆ సంఘం సభ్యులతో తరచూ సమావేశం అవుతున్నాడు.
Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?
అయితే ఈ సమావేశాలు సేవా కార్యక్రమాలకు సంబంధించినవి కావని తెలుస్తుంది. ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు మరియు రాజకీయ పరమైన అంశాల పై చర్చ జరుగుతున్నట్లు తమిళనాట వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం (జులై 13) నాడు 15 జిల్లాలకు చెందిన విజయ్ ప్రజా సంఘాలను కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో విజయ్ ప్రజా సమస్యల పోరాటానికై పాదయాత్ర చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ పాదయాత్రని మొదలుపెట్టి తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నాడని వినిపిస్తుంది.
Ghost : ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ తానే అంటున్న శివరాజ్ కుమార్.. ‘ఘోస్ట్ – బిగ్ డాడీ’ టీజర్ విడుదల..
మరి ఈ వార్తల్లో నిజం ఎంతో ఉందో తెలియదు గాని తమిళనాట ఈ విషయం అనేక చర్చలకు దారి తీస్తుంది. ఇటీవల తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన 10వ తరగతి మరియు ప్లస్–1, ప్లస్–2 తరగతుల్లో మొదటి 3 ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను అభినందించి, ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధం దానిని డబ్బుకి అమ్ముకోవద్దని విజయ్ మాట్లాడడం. ఆ తరువాత ప్రజా సంఘాలతో ఇలా వరుస సమావేశాల్లో పాల్గొనడంతో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఫుల్ గా రెడీ అవుతున్నాడని సమాచారం. కాగా విజయ్ తండ్రి ఆల్రెడీ విజయ్ పేరు మీద ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నాడు. అయితే అదే పార్టీని విజయ్ టేక్ ఆఫ్ చేస్తాడా? లేదా మరొక పార్టీతో వస్తాడా? అనేది చూడాలి.