Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?

విజయ్ అండ్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందట. గతంలో రీమేక్ తో అలరించిన వీరి కాంబినేషన్..

Vijay : 11 ఏళ్ళ తరువాత మరోసారి శంకర్ దర్శకత్వంలో విజయ్.. ఈసారి రీమేక్..? ఒరిజినల్..?

tamil hero Vijay is again collaborate with director shankar

Updated On : July 12, 2023 / 11:06 AM IST

Vijay : కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం లియో (Leo) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని తన పార్ట్ షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేశాడు. ఇప్పుడు తన 68వ సినిమాకి సిద్దమవుతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది. ఆల్రెడీ అధికారికంగా ప్రకటించిన ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీ స్టార్ట్ కాకముందే మరో మూవీ న్యూస్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే విజయ్ 69వ సినిమా శంకర్ దర్శకత్వంలో ఉండబోతుందట.

Vijay : మరోసారి అభిమానులతో విజయ్ భేటీ.. రాజకీయం గురించేనా..?

గతంలో విజయ్ అండ్ శంకర్ కలిసి ‘స్నేహితుడు’ అనే సినిమాని చేశారు. ఈ మూవీ బాలీవుడ్ మూవీ త్రీ ఇడియట్స్ (3 Idiots) కి రీమేక్ గా తెరకెక్కింది. శంకర్ కెరీర్ లో చేసిన ఒకే ఒక రీమేక్ ఇది. 2012 లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయానే అందుకుంది. దాదాపు 11 ఏళ్ళ తరువాత మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. గత కొంత కాలంగా ఈ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 (Indian 2), గేమ్ చెంజర్ (Game Changer) సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో..

దీంతో వచ్చే ఏడాది సమ్మర్ వరకు శంకర్ ఈ సినిమాల పనుల్లోనే ఉండనున్నాడు. విజయ్, వెంకట్ ప్రభు సినిమా కూడా 2023 సమ్మర్ తోనే పూర్తి కానుంది. ఈ క్రమంలోనే శంకర్ అండ్ విజయ్ వచ్చే ఏడాది వేసవిలో పట్టాలు ఎక్కనుంది అంటూ వినిపిస్తుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు గాని విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలు ఎక్కితే బాగుండని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈసారి రీమేక్ కాకుండా శంకర్ మార్క్ లో ఒక ఒరిజినల్ స్టోరీతో సినిమా కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.