Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో..

వరుణ్ తేజ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్ అయ్యింది. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో యాక్షన్ సీక్వెన్స్..

Gandeevadhari Arjuna : గాండీవధారి అర్జున ప్రీ టీజర్ చూశారా.. హాలీవుడ్ జేమ్స్ బాండ్ రేంజ్‌లో..

Varun Tej Gandeevadhari Arjuna pre teaser released

Updated On : July 12, 2023 / 10:43 AM IST

Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తన 12వ సినిమాని చేస్తున్నాడు. ‘గాండీవధారి అర్జున’ అనే పవర్ ఫుల్ డైలాగ్ ని పెట్టుకున్న ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో వరుణ్ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ తో అలరించిన మెగా ప్రిన్స్ మొదటిసారి ఫుల్ యాక్షన్ మోడ్ లోకి దిగబోతున్నాడు.

Vijay : మరోసారి అభిమానులతో విజయ్ భేటీ.. రాజకీయం గురించేనా..?

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. మూవీ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు పవర్ ఫుల్ టీజర్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగా ప్రీ టీజర్ అంటూ ఒక చిన్న శాంపిల్ వదిలారు. ఈ ప్రీ టీజర్ లోని విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. గన్స్, కార్ అండ్ బైక్ సీన్స్, యాక్షన్ సీన్స్ పై ఒక్కో షాట్ చూపించి మూవీలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పాడు డైరెక్టర్.

Kashmira Shah : 14 సార్లు ప్రయత్నించినా తల్లిని కాలేకపోయా.. కానీ సల్మాన్ ఇచ్చిన సలహా వల్ల..

కాగా పూర్తి టీజర్ ని త్వరలో రిలీజ్ చేస్తామంటూ చెప్పారు గాని, టైం అండ్ డేట్ చెప్పలేదు. అయితే ఈ ప్రీ టీజర్ తోనే ఆడియన్స్ లో మూవీ పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యేలా చేశారు. ఇక ఫుల్ టీజర్ అండ్ ట్రైలర్ తో ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోండగా విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.