Raviteja : మైత్రీ అనౌన్స్‌మెంట్ రవితేజ సినిమా గురించేనా..? ఆ సక్సెస్ ఫుల్ కాబో మళ్ళీ రిపీట్..!

మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్‌మెంట్ రవితేజ సినిమా గురించేనా..? సక్సెస్ ఫుల్ కాబో అంటే ఏ దర్శకుడు గోపిచంద్ మలినేని లేదా హరీష్ శంకర్?

Raviteja : మైత్రీ అనౌన్స్‌మెంట్ రవితేజ సినిమా గురించేనా..? ఆ సక్సెస్ ఫుల్ కాబో మళ్ళీ రిపీట్..!

Raviteja next with Harish Shankar or Gopichand Malineni under Mythri

Updated On : July 7, 2023 / 7:27 PM IST

Raviteja : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రెజెంట్ రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao), మరొకటి ఈగల్ (Eagle). ఇది ఇలా ఉంటే, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) చేసిన కొత్త అనౌన్స్‌మెంట్ రవితేజ సినిమా గురించే అంటూ నెట్టింట చర్చ నడుస్తుంది.

Prabhas : మరోసారి ప్రభాస్‌తో పోటీకి దిగుతున్న దర్శకుడు.. ఈసారైనా ప్రభాస్ నెగ్గుతాడా..?

“ది మోస్ట్ సక్సెస్ ఫుల్ కాబో మళ్ళీ రాబోతుంది. జులై 9 ఉదయం 11:11 గంటలకు మాస్ అప్డేట్ రాబోతుంది రెడీగా ఉండండి” అంటూ మైత్రీ నిర్మాతలు ట్వీట్ చేశారు. అయితే గత కొంత కాలంగా రవితేజ.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని గోపిచంద్ మలినేని లేదా హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రవితేజ వీరిద్దరి దర్శకత్వంలో సూపర్ హిట్స్ అందుకున్నాడు. గోపీచంద్ తో హ్యాట్రిక్ హిట్ కొడితే, హరీష్ తో మిరపకాయ్ బాక్స్ ఆఫీస్ కి ఘాటు చూపించాడు.

Nayakudu Trailer : మ‌హేశ్ బాబు విడుద‌ల చేసిన నాయ‌కుడు ట్రైల‌ర్ చూశారా..?

ఇప్పుడు మైత్రీ మేకర్స్ సక్సెస్ ఫుల్ కాబో అని ట్వీట్ చేయడంతో వీరిద్దరిలో ఎవరో ఒకరితో రవితేజ సినిమా ఉండబోతుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ సక్సెస్ ఫుల్ కాబో ఎవరో తెలియాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఇక సెట్స్ పై ఉన్న రవితేజ సినిమాలు విషయానికి వస్తే.. టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా వస్తుంది. అక్టోబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈగల్ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు.