Realme Narzo 60 Series : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రియల్‌మి నార్జో 60 సిరీస్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. జూలై 15 నుంచే సేల్..!

Realme Narzo 60 Series : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రియల్‌మి నార్జో సిరీస్ సరసమైన ధరకే వచ్చేసింది. నార్జో 60 సిరీస్‌ హైఎండ్ ఫీచర్‌లతో భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Realme Narzo 60 Series : కొంటే ఈ ఫోన్ కొనాలి భయ్యా.. సరసమైన ధరకే రియల్‌మి నార్జో 60 సిరీస్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. జూలై 15 నుంచే సేల్..!

Realme Narzo 60 Pro and Narzo 60 launched in India, price starts at Rs 17,999

Realme Narzo 60 Series : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి (Realme) నుంచి నార్జో 60 సిరీస్ (Realme Narzo 60 Series) వచ్చేసింది. కంపెనీ నార్జో 60, నార్జో 60 ప్రో అనే రెండు స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. రియల్‌మి Narzo 60 సిరీస్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మి 11 ప్రో సిరీస్ మాదిరిగానే బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ ఎండ్ వృత్తాకార కెమెరాను కలిగి ఉంది. నార్జో సిరీస్ నార్జో 60 సరసమైన ధరలో కొన్ని హైఎండ్ ఫీచర్‌లను చేర్చింది. OISతో 100MP ప్రైమరీ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పాటు 12GB+12GB డైనమిక్ RAMని కలిగి ఉంది. ఈ డివైజ్ 1TB ఫ్లాగ్‌షిప్-లెవల్ స్టోరేజీని కలిగి ఉంది.

రియల్‌మి నార్జో 60, ప్రో ధర ఎంతంటే? :
రియల్‌మి నార్జో 60 ప్రో మోడల్ 8GB RAM, 128GB స్టోరేజీ ధర రూ. 23,999కి లాంచ్ అయింది. 12GB, 1TB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999గా ఉంది. Narzo 60 మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ ధర రూ.17,999కు పొందవచ్చు. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999కు సొంతం చేసుకోవచ్చు. ఈ రెండు డివైజ్‌లు జూలై 15న విక్రయానికి అందుబాటులో ఉంటాయి.

Read Also : iPhone 14 Plus Price : అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 14 ప్లస్ ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

రియల్‌మి నార్జో 60 సిరీస్ స్పెసిఫికేషన్‌లు :
నార్జో 60 ప్రో 5G ఫోన్ (2,400 x 1,080) పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వడ్ SuperAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. మృదువైన స్క్రోలింగ్, హై రిఫ్రెష్ రేట్, హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌కు డిస్‌ప్లే సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI 4.0తో రన్ అవుతుది. ఈ ఫోన్ MediaTek Dimensity 7050 5G చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 24GB RAM నుంచి 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో మెమరీ ఆప్షన్లను అందిస్తుంది.

Realme Narzo 60 Pro and Narzo 60 launched in India, price starts at Rs 17,999

Realme Narzo 60 Series launched in India, price starts at Rs 17,999

నార్జో 60 ప్రో 5G ఆకట్టుకునే కెమెరా సెటప్‌తో ఫొటోగ్రఫీలో వస్తుంది. 2MP సెకండరీ సెన్సార్‌తో పాటు స్టేబుల్ ఫొటోలను క్యాప్చర్ చేసేందుకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 100MP ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా మల్టీ షూటింగ్ ఆప్షన్లతో ఆటో-జూమ్ ఆప్షన్ కూడా కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ స్పష్టమైన సెల్ఫీలు, వీడియో కాల్‌లను 16MP కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీ కలిగి ఉంది. 67W పవర్ డెలివరీతో SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్టు ఇస్తుంది. ఈ మోడల్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. కాస్మిక్ నైట్ మోడల్ బరువు 185 గ్రాములు, మార్టిన్ సన్‌రైజ్ వేగాన్ లేయర్ ఎండ్ 191 గ్రాముల బరువు ఉంటుంది.

రియల్‌మి నార్జో 60 కర్వడ్ 6.43-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హై-డెఫినిషన్ ఫొటోలను క్యాప్చర్ చేయగలదు. రియల్‌మి సొంత యూజర్ ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. MediaTek Dimensity 6020 ప్రాసెసర్‌తో ఆధారితమైనది. 16GB వరకు RAM 256GB స్టోరేజీ కలిగి ఉంది. ఈ ఫోన్ షార్ప్ ఫొటోలకు 64MP మెయిన్ కెమెరా, సెల్ఫీలకు 16MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. కాస్మిక్ బ్లాక్ వెర్షన్ 182 గ్రాముల బరువు, 159.8mm x 72.9mm x 7.93mm, అయితే మార్స్ ఆరెంజ్ వెర్షన్ మందం 7.98mm కారణంగా కొంచెం ఎక్కువ బరువు కలిగి ఉంది.

Read Also : OnePlus Nord 3 5G : వన్‌ప్లస్ నార్డ్ 3 సిరీస్ 5G ఫోన్ కెమెరా ఫీచర్లు లీక్.. జూలై 5నే లాంచ్..!