Action Movies : సో కాల్డ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు వద్దు.. యాక్షన్ లో కూడా కొత్తదనం కావాలి..

యాక్షన్ మూవీ తో హిట్ కొడితేనే కమర్షియల్ స్టార్ అవుతారని ఇండస్ట్రీలో సో కాల్డ్ నమ్మకం. అందుకే ఒకప్పుడు మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎలివేటెడ్ మూవీస్ తో సూపర్ హిట్ కొట్టారు హీరోలు. కానీ టైమ్ మారింది, ట్రెండ్ మారింది. కంటెంట్ కావాలే కానీ, అనవసరమైన యాక్షన్..........

Action Movies : సో కాల్డ్ యాక్షన్ కమర్షియల్ సినిమాలు వద్దు.. యాక్షన్ లో కూడా కొత్తదనం కావాలి..

action movies

 

Action Movies :  యాక్షన్ మూవీ తో హిట్ కొడితేనే కమర్షియల్ స్టార్ అవుతారని ఇండస్ట్రీలో సో కాల్డ్ నమ్మకం. అందుకే ఒకప్పుడు మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ ఎలివేటెడ్ మూవీస్ తో సూపర్ హిట్ కొట్టారు హీరోలు. కానీ టైమ్ మారింది, ట్రెండ్ మారింది. కంటెంట్ కావాలే కానీ, అనవసరమైన యాక్షన్ ఎందుకని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. అందుకే కంటెంట్ లేని యాక్షన్ సినిమాల్ని, హీరోల్ని అసలు పట్టించుకోవట్లేదు జనాలు. కానీ ఇప్పుడు హీరోలు మాత్రం ఇంకా పాత సూత్రాన్నే నమ్ముతూ సక్సెస్ ఇచ్చిన లవ్ సినిమాలని వదిలేసి మాస్ అంటూ వెళ్లి చేతులు కాల్చుకుంటున్నారు.

10 మందిని కొట్టిన హీరోని చూడడానికి ధియేటర్లకు వెళ్ళే రోజులు పోయాయి. ఒకప్పుడు యాక్షన్ సీన్స్ కోసమే ధియేటర్లకు వెళ్లిన జనాలు ఇప్పుడు అసలు యాక్షన్ ని పట్టించుకోవడం లేదు. ఈమధ్య టాలీవుడ్ లో రిలీజ్ అయిన మాచర్ల నియోజక వర్గం, వారియర్, ఖిలాడి ఇలా యాక్షన్ సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయంటే జనాలు యాక్షన్ ని ఎంత లైట్ తీసుకుంటున్నారో అర్దం చేస్కోవచ్చు. ఆ హీరో, ఈహీరో అని తేడా లేదు ఏ హీరో అయినా సరే అర్దం పర్దం లేని యాక్షన్ సినిమాలు తీస్తే లైట్ తీసుకుంటున్నారు ఆడియన్స్ .

ఈమధ్య తెలుగులో రిలీజ్ అయిన యాక్షన్ సినిమాలన్నీ ఫ్లాపే. కెరీర్ లో ఎక్కువగా లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేసిన నితిన్ కొత్త ఇమజ్ కోసం కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేశారు. మాచర్లనియోజకవర్గం టైటిల్ తో తెరకెక్కిన నితిన్ సినిమా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడం లో అంత సక్సెస్ కాలేకపోయింది. సినిమాలో కంటెంట్ కన్నా అనవసరమైన యాక్షన్ ఎలివేషన్ మీదే ఎక్కువ కాన్సన్ ట్రేట్ చెయ్యడంతో ఆడియన్స్ అస్సలు ఎట్రాక్ట్ అవ్వలేకపోయారు.

Tamannaah in Jailer Movie : రజినీకాంత్ సరసన తమన్నా.. ‘జైలర్’లో హీరోయిన్ గా మిల్కీబ్యూటీ?

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే యాక్షన్ ఎలివేటెడ్ సినిమాలు కూడా చేస్తున్నారు. అయితే అన్ని సార్లు రవితేజ ఎక్స్ పెక్ట్ చేసిన రిజల్ట్ మాత్రం రావడం లేదు. లేటెస్ట్ గా శరత్ మండవతో చేసిన రామారావ్ ఆన్ డ్యూటీ మూవీ కంటెంట్ ఇంట్రస్ట్రింగ్ గా ఉన్నా ఎలివేషన్ కోసం ఎరేంజ్ చేసిన యాక్షన్ తో సినిమా ఫీల్ ట్రాక్ తప్పడంతో సినిమాని యాక్సెప్ట్ చెయ్యలేదు ఆడియన్స్. ఇదే యాక్షన్ తో మరో ఫ్లాప్ తన అకౌంట్ లో వేసుకున్నారు రవితేజ. కామెడీ, ట్విస్ట్ లతో ఉన్న సినిమా అయినా కూడా మరీ మితి మించిన యాక్షన్ ని నింపేయడంతో ఖిలాడి కూడా అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. క్రాక్ మూవీ హిట్ తర్వాత ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ తో రవితేజ రిలీజ్ చేసిన ఖిలాడి యాక్షన్ మోతాదు మించడంతో పెద్దగా ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యలేకపోయింది.

క్యూట్ లవ్ స్టోరీలతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రామ్ కూడా యాక్షన్ మూవీ ట్రై చేసి దెబ్బ తిన్నాడు. లింగుస్వామి డైరెక్షన్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా లేటెస్ట్ గా రిలీజ్ అయిన వారియర్ మూవీ రామ్ కి చేదు అనుభవాన్నే మిగిల్చింది. కంప్లీట్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకుని యాక్షన్ డోస్ పెంచిన రామ్ వారియర్ తో ఫ్లాప్ ని చూడాల్సి వచ్చింది. ఇలా కేవలం యాక్షన్ సీన్స్ మీదే ఫోకస్ చేసి సినిమాలు తీస్తుంటే జనాలు తిప్పి కొడుతున్నారు.

Pop Singer Smitha : పాప్ సింగర్ స్మిత స్పెషల్ పర్ఫార్మెన్స్

యాక్షన్ లో కొత్తదనం, కమర్షియల్ లో కొత్త పాయింట్స్ ని పెట్టి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలి, ఎక్కడ తాగించాలి అని కరెక్ట్ గా ప్లాన్ చేసి తీస్తే కచ్చితంగా హిట్ అవుతున్నాయి. ఇటీవల వచ్చిన KGF 2, RRR, పుష్ప, అఖండ, బింబిసార ఇవన్నీ కూడా మాస్ కమర్షియల్ సినిమాలే. కానీ ఇవి యాక్షన్ సీన్స్ మీదే ఫోకస్ చేయకుండా కథ మీద ఫోకస్ చేయడంతో మంచి విజయాలు సాధించాయి.