‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ కోసం నిక్ పోవెల్..

‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ కోసం నిక్ పోవెల్..

RRR – Nick Powell: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి చూపించబోతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. విడుదల తేదీ ప్రకటించినప్పటి నుండి RRR టీమ్ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూనే ఉంది.

RRR

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులపై క్లైమాక్స్‌ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పోవెల్ రంగంలోకి దిగారు. ‘గ్లాడియేటర్’, ది బోర్న్ ఐడెంటిటీ’, ‘2.0’, ‘ఎక్స్ -మెన్: ది లాస్ట్ స్టాండ్’ వంటి సినిమాలకు నిక్ పోవెల్ వర్క్ చేశారు. ఆయన రాకతో ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ మరింత బెస్ట్‌గా రూపొందనుందని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది టీమ్.