RGV : నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ

కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ''కొండా'' సినిమాలో తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అవ్వడంతో వరంగల్ లో......

RGV : నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ

Rgv

Updated On : December 26, 2021 / 2:04 PM IST

RGV :  ఆర్జీవీ.. సినిమాల్లో తాను సృష్టించిన సెన్సేషన్స్ అంతా ఇంతా కావు. కానీ సినిమాల కంటే తన ట్వీట్స్ తో, మాటలతో ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎవరి బయోపిక్ అయినా ధైర్యంగా తీయగలిగే సత్తా ఆర్జీవికి ఒక్కడికే ఉంది. అందుకే రాజకీయాల్లోని చాలా మంది బయోపిక్స్ ని ఒక్కొక్కటిగా తెరకెక్కిస్తున్నారు. గతంలో అనేక రాజకీయ నాయకుల బయోపిక్స్ తో హల్ చల్ చేసిన ఆర్జీవీ ఇటీవల తెలంగాణ నాయకుడు కొండా మురళి బయోపిక్ ని అనౌన్స్ చేశాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ సినిమా ఆసక్తిగా మారింది.

గతంలో ఆర్జీవీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ”నేను మాఫియా, ఫ్యాక్షనిజం, రౌడీయిజంపై సినిమాలు తీసాను కానీ తెలంగాణ నక్సలైట్, మావోయిస్టుల గురించి తీయలేదు. ఇప్పుడు కొండా మురళి బయోపిక్ తో అది కూడా పూర్తవుతుంది” అని తెలిపారు. కొండా మురళి, కొండా సురేఖల నేపథ్యంలోంచి తెలంగాణ రాజకీయాలని, సాయుధ పోరాటాలని ”కొండా” సినిమాలో తెరకెక్కించారు. ఈ సినిమా షూటింగ్ తాజాగా పూర్తి అవ్వడంతో వరంగల్ లో షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా పార్టీ చేసుకున్నారు.

OTT Releases: ఓటీటీ జాతర.. టీవీలకు అతుక్కుపోయే కంటెంట్ సిద్ధం!

ఈ పార్టీకి ఆర్జీవీ నక్సలైట్ గెటప్ లో వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నక్సలైట్ గెటప్ తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ పార్టీకి కొండా మురళి, కొండా సురేఖలు కూడా వచ్చారు. వారు కూడా సినిమా గురించి మాట్లాడి ఆర్జీవితో ఫోటోలు దిగారు. ఆర్జీవీ నక్సలైట్ గెటప్ లో రావడమే కాకుండా ఈ సినిమాలోని పాటలకు నటీనటులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు.