RRR Mass Anthem : ఈ ఊపు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ పాటే..

RRR Mass Anthem : ఈ ఊపు ఇప్పట్లో ఆగేలా లేదుగా..

Mass Anthem

Updated On : November 19, 2021 / 7:34 PM IST

RRR Mass Anthem: ‘ఆర్ఆర్ఆర్’ మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఈ పాటే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి ‘నాటు నాటు’ సాంగ్‌తో రచ్చ లేపారు. ఈ ఇద్దరు హీరోలూ బెస్ట్ డ్యాన్సర్స్ అనే సంగతి తెలిసిందే. అలాంటి వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఇక చెప్పేదేముంటుంది..

RRR Movie : ఇదీ తెలుగు సినిమా సత్తా.. ప్రపంచవ్యాప్తంగా పదివేలకు పైనే..

రచ్చరంబోలానే కదా.. కీరవాణి ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ పాటను వేరే లెవల్‌కి తీసుకెళ్లాయి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు.. పిల్లల నుండి పండు ముసలి వరకు అందరూ ఈ పాటకు కాలు కదుపుతున్నారు.

Naatu Naatu Song : డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ! వీడియో వైరల్..

ఇప్పటివరకు విడుదల చేసిన ఐదు భాషల్లో 40 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 2 మిలియన్లకు పైగా లైక్స్ సాధించడం విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది ‘ఆర్ఆర్ఆర్’.

RRR Movie : ‘నాటు నాటు’ సాంగ్‌కి నడిరోడ్డుపై ఊరమాస్ డ్యాన్స్!