Ukrain weds Russia: భారత సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఉక్రెయిన్-రష్యా ప్రేమ జంట

కేవలం భారత్‭లో పెళ్లితో ఆగకుండా భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే హిమాచల్ ప్రదేశ్‭‭లోని ధర్మశాలను వేదికగా చేసుకున్నారు. మెహెందీ అద్దుకొని చీర, కుర్తాలు ధరించి పూర్తిగా భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి స్థానికులు అతిథులుగా హాజరయ్యారు. సనాతన సంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకున్నాక ఈ పద్దతిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నూతన దంపతులు తమ వివాహం అనంతరం ఆనందంతో చెప్పారు.

Ukrain weds Russia: భారత సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఉక్రెయిన్-రష్యా ప్రేమ జంట

Ukrain weds Russia: ఐదు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు దద్దరిల్లుతున్నాయి. ప్రపంచ దేశాలు తమ ప్రయత్నం చేస్తున్నప్పటికీ యుద్ధం ముగించి సానుకూల పరిస్థితివైపు వెళ్లేందుకు ఏ దేశమూ సముఖంగా కనిపించడం లేదు. అయితే ఒక ప్రేమ జంట దీనికి చక్కని పరిష్కారం చూపినట్టుగా కనిపిస్తోంది. అదే ప్రేమ. అవును.. రష్యాకు చెందిన ఒక యువకుడు, ఉక్రెయిన్‭కు చెందిన యువతికి తాజాగా వివాహం జరిగింది. అది కూడా పూర్తి భారతీయ సంప్రదాయంలో, హిమాచల్ ప్రదేశ్‭‭లోని ధర్మశాలలో జరగడం మరో విశేషం. మనుషులనే కాదు, ప్రాంతాలను కలిపేందుకు ప్రేమ కావాలని వీరి పెళ్లితో చెప్పనకే చెప్పారని నెటిజెన్లు అంటున్నారు.

రష్యాకు చెందిన సెర్గెయ్, ఉక్రెయిన్‭కు చెందిన ఎలోనా బ్రమోక గత రెండేళ్లుగా రిలేషన్‭షిప్‭లో ఉన్నారు. సెర్గెయ్ ఉక్రెయిన్‭లో సెటిల్ అయిన రష్యా వాసి. అయితే కొద్ది రోజుల క్రితమే వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు భారత్‭ను ఎంచుకున్నారు. కేవలం భారత్‭లో పెళ్లితో ఆగకుండా భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లుగానే హిమాచల్ ప్రదేశ్‭‭లోని ధర్మశాలను వేదికగా చేసుకున్నారు. మెహెందీ అద్దుకొని చీర, కుర్తాలు ధరించి పూర్తిగా భారతీయ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి స్థానికులు అతిథులుగా హాజరయ్యారు. సనాతన సంప్రదాయంలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకున్నాక ఈ పద్దతిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నూతన దంపతులు తమ వివాహం అనంతరం ఆనందంతో చెప్పారు.

China: తైవాన్ విష‌యంలో ఉద్రిక్త‌త‌ల వేళ చైనాకు అమెరికా వార్నింగ్