Muhammad Iqbal: ‘సారే జహాసె అచ్చ’ గేయ రచయితనీ వదల్లేదు.. డీయూ సిలబస్ నుంచి మహ్మద్ ఇక్బాల్ ఔట్

విభజన అధ్యయనాలు, హిందూ అధ్యయనాలు, గిరిజన అధ్యయనాల కోసం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఐదుగురు కౌన్సిల్ సభ్యులు విభజన అధ్యయనాల ప్రతిపాదనను వ్యతిరేకించారు.

Muhammad Iqbal: ‘సారే జహాసె అచ్చ’ గేయ రచయితనీ వదల్లేదు.. డీయూ సిలబస్ నుంచి మహ్మద్ ఇక్బాల్ ఔట్

Delhi University: సారే జహాసే అచ్చ గేయ రచయిత, పాకిస్తాన్ జాతీయ కవి ముహమ్మద్ ఇక్బాల్‌కు సంబంధించిన అధ్యాయాన్ని పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్ తీర్మానం చేసింది. పాకస్తాన్ ఆలోచన విధానాన్ని రేకెత్తించినట్లు పేరున్న ముహమ్మద్ అల్లామా ఇక్బాల్, 1877లో ఉమ్మడి భారతదేశంలో (బ్రిటిషు పాలనలోనిది) జన్మించారు. కాగా, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆరవ సెమిస్టర్ పేపర్‌లో ‘మోడరన్ ఇండియన్ పొలిటికల్ థాట్’ అనే అధ్యాయంలో ఒక భాగంగా ఇక్బాల్ గురించి ఉందట.

Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్‭లో తిరుగుబాటు లేసిందా? కొత్త చిక్కులు తెస్తున్న మంత్రివర్గ విస్తరణ

ఢిల్లీ యూనివర్సిటీ 1014వ అకడమిక్ కౌన్సిల్ సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై చర్చ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ మాట్లాడుతూ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పునాది వేసిన వారు సిలబస్‌లో ఉండకూడదని అన్నారు. వైస్ ఛాన్సలర్ ప్రతిపాదనను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో అండర్ గ్రాడ్యుయేట్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (యుజిసిఎఫ్) 2022 కింద వివిధ కోర్సుల నాలుగు, ఐదు, ఆరవ సెమిస్టర్‌ల సిలబస్‌కు తీర్మానం ఆమోదించారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్‌ తదితరుల బోధనపై కూడా వైస్ ఛాన్సలర్ స్పందించారు.

Water Crisis in Nasik : మంచినీటి కోసం 70 అడుగుల బావిలోకి దిగుతున్న మహిళలు

కాగా, విభజన అధ్యయనాలు, హిందూ అధ్యయనాలు, గిరిజన అధ్యయనాల కోసం కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను కౌన్సిల్ ఆమోదించింది. అయితే ఐదుగురు కౌన్సిల్ సభ్యులు విభజన అధ్యయనాల ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఢిల్లీ యూనివర్సిటీ కౌన్సిల్ చేసిన ఈ తీర్మానాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనుబంధ విద్యార్థి సంఘం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతించింది. ‘‘మతోన్మాద వేదాంత పండితుడు ఇక్బాల్ భారతదేశ విభజనకు కారణం’’ అని ఆ సంస్థ పేర్కొంది.

NCERT సిలబస్ నుంచి ముఘల్స్, డార్విన్ సిద్ధాంతం తొలగింపు
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) ఏప్రిల్‌లో మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన అధ్యాయాలు 12వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి తొలగించింది. 7-12 తరగతుల నుంచి పాఠ్యా పుస్తకాల్లో మొఘల్ చరిత్రకు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను తొలగించారు. 2023-24 విద్యా సంవత్సరంలో పుస్తకాల్లో ఈ పాఠాలు లేవు. ఇక 9,10 తరగతి పుస్తకాల్లో చార్లెస్ డార్విన్ పాఠ్యాంశాన్ని తొలగించారు.