Water Crisis in Nasik : మంచినీటి కోసం 70 అడుగుల బావిలోకి దిగుతున్న మహిళలు

మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.

Water Crisis in Nasik : మంచినీటి కోసం 70 అడుగుల బావిలోకి దిగుతున్న మహిళలు

Water Crisis in Nasik

Drinking water problem in Nasik : మహారాష్ట్రలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. మంచినీటి కోసం మహిళలు తాడుతో 70 అడుగుల బావిలోకి దిగుతున్నారు. ఏ మాత్రం తాడు తెగినా ప్రాణాలకే ప్రమాదం. వారి పరిస్థితి చూసేవారికి కంటనీరు తెప్పిస్తోంది.

బంగారమే : నాసిక్‌లో లక్ష విలువైన ఉల్లిగడ్డల దొంగతనం

సోషల్ మీడియాలో మనసుని కదిలించే వీడియో బయటకు వచ్చింది. మహారాష్ట్ర నాసిక్‌లోని గంగోద్వారి గ్రామంలో మహిళలు మంచినీటి కోసం పడుతున్న కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. తాడుతో 70 అడుగుల బావిలోకి దిగి ప్లాస్టిక్ టంబ్లర్లతో మురికి నీటిని సేకరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆ తరువాత ఆ నీటిని మట్టి కుండల్లో జల్లెడ పడుతున్నారు. ఈ పరిస్థితిని చూస్తే అక్కడ నీటి సంక్షోభం ఏ స్ధాయలో ఉందో కళ్లకు కడుతోంది.

 

మహారాష్ట్రలో నీటి ఎద్దటి దశాబ్దకాలంగా ఉంది. అయితే నాసిక్ లోని గంగోద్వారి గ్రామ ప్రజలు ప్రతిరోజు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఎండాకాలం వీరి సమస్య మరింత తీవ్రమైంది. ఇక మంచినీటి కోసం బావిలోకి దిగిన మహిళలు ఏ ప్రమాదంలో పడతారా అని ప్రతిరోజు ఆందోళన చెందుతామని గ్రామ సర్పంచ్ మోహన్ గవ్లీ చెబుతున్నారు.

Pawan Kalyan OG : మహారాష్ట్రలో జనసైనికులతో పవన్.. OG లుక్ అదిరిపోయిందిగా!

ఈ వీడియోపై గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి విజయ్‌కుమార్‌ కృష్ణారావు గవిట్‌, రాష్ట్ర మంత్రి దాదాజీ భూసే లు స్పందించారు. ‘జల్ జీవన్ మిషన్’ కింద నీటిని అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ ప్రాజెక్టుకు టెండర్ పాస్ అయ్యిందని చెబుతున్నారు. ఇవి జరిగేదెప్పుడో.. ఇక్కడి ప్రజల కష్టాలు తీరెదెప్పుడో?