Sai Pallavi : ఆ సినిమా నన్ను ప్రేమలో పడేలా చేసింది.. సాయి పల్లవి పోస్ట్ వైరల్..!

ఆ సినిమా తనని ప్రేమలో పడేలా చేసింది అంటూ సాయి పల్లవి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Sai Pallavi : ఆ సినిమా నన్ను ప్రేమలో పడేలా చేసింది.. సాయి పల్లవి పోస్ట్ వైరల్..!

Sai Pallavi post on Gargi movie one year completion gone viral

Updated On : July 16, 2023 / 12:31 PM IST

Sai Pallavi : లేడీ పవర్ స్టార్ గా ఫేమ్ ని సంపాదించుకున్న సాయి పల్లవి.. చాలా గ్యాప్ తరువాత ఇటీవలే తన కొత్త సినిమాని ప్రకటించింది. 2022 లో వచ్చిన గార్గి సినిమా తరువత ఈ ముద్దుగుమ్మ మరో మూవీ ప్రకటించపోవడంతో.. సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది అంటూ రూమర్స్ వచ్చాయి. దీంతో అభిమానులంతా చాలా కలవర పడ్డారు. కానీ తమిళ్ హీరో శివ కార్తికేయన్ తో రీసెంట్ గా సినిమా ప్రకటించడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Devara – Allu Arha : ఎన్టీఆర్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

ఇది ఇలా ఉంటే, సాయి పల్లవి తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ సినిమా తనని ప్రేమలో పడేలా చేసింది అంటూ ట్వీట్ చేసింది. అసలు విషయం ఏంటంటే.. ఈ భామ నటించిన గార్గి మూవీ వన్ ఇయర్ పూర్తి చేసుకుంది. ఈ విషయం గుర్తు చేసుకుంటూ.. “గార్గి వచ్చి ఒక సంవత్సరం పూర్తి అయ్యిపోయింది. గార్గిలోని ఆ పాత్ర నన్ను సినిమాలను మరింత ప్రేమించేలా చేసింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు గౌతమ్ కి థాంక్యూ” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మూవీలోని ఒక చేజ్ సీన్ పిక్ షేర్ చేస్తూ.. ‘ఆ సీక్వెన్స్ లో నేను చాలా సీరియస్ గా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Sai Pallavi : సాయి పల్లవి అమర్‌నాథ్‌ యాత్ర.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇక ప్రస్తుతం సాయి పల్లవి నటిస్తున్న SK21 విషయానికి వస్తే.. ఈ మూవీ దేశభక్తి నేపథ్యంతో రాబోతుందని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ని కాశ్మీర్ లో ప్రారభించిన చిత్ర యూనిట్.. ఇటీవలే అక్కడి షెడ్యూల్ ని పూర్తి చేసింది. రాజ్‌కుమార్‌ పెరియసామి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. లోక‌నాయ‌కుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం గమనార్హం. జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తుండ‌గా, సిహెచ్.సాయి సినిమాటోగ్రఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.