Virat Kohli: కోహ్లీ విజయాలను జీర్ణించుకోలేకే ఇలా.. – రవి శాస్త్రి

రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో 'కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు' అంటూ కామెంట్ చేశాడు.

Virat Kohli: కోహ్లీ విజయాలను జీర్ణించుకోలేకే ఇలా.. – రవి శాస్త్రి

Virat Kohli

Virat Kohli: టీమిండియా టెస్టు కెప్టెన్సీకి కూడా విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన తర్వాత ఆ పదవి ఖాళీగా ఉండిపోయింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు ఫార్మాట్ లో 1-2తేడాతో ఓడిపోయిన తర్వాత మొత్తం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. దీనిపై రీసెంట్ గా రవి శాస్త్రి ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘కొందరు అతని విజయాన్ని జీర్ణించుకోలేకపోయారు’ అంటూ కామెంట్ చేశాడు.

ఇదే విషయాన్ని ప్రస్తావించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. మాజీ కోచ్ కు టీమిండియా వాతావరణం పట్ల ఉన్న అవగాహన మరెవ్వరికీ ఉండదని వివరించాడు.

కచ్చితంగా శాస్త్రికి అక్కడి వాతావరణమంతా అందరికంటే బాగా తెలుసు. ఇండియా, పాకిస్తాన్ జట్లలో చాలా పోలికలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు గెలవడానికి ప్రయత్నించే వారి మైండ్ సెట్ తో దాదాపు టాప్ క్లాస్ అథ్లెట్స్ ఫెయిల్ అవుతున్నారు. వారి దారుల్లో సొంత మనుషుల వల్లే చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దురదృష్టకరమే అయినా ఇది వాస్తవం’ అని యూట్యూబ్ ఛానెల్ వేదికగా బట్ చెప్పారు.

Read Also : 400 కోట్లు ఆఫర్!

శాస్త్రి ఏం చెప్పాడంటే.. ‘కచ్చితంగా కోహ్లీ మరో రెండేళ్ల పాటు టెస్టు కెప్టెన్సీ కొనసాగించేవాడు. ర్యాంకింగ్స్ పరంగా చూస్తే కోహ్లీ కెప్టెన్సీలో చాలా మార్పులు వచ్చాయి. అతని కెప్టెన్సీ 50విజయాలకు పైగా చవిచూశాం. ఆ విషయాన్నే కొందరు జీర్ణించుకోలేకపోయారు’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 68 టెస్టుల్లో 40విజయాలు నమోదు చేసుకుంది. ఇండియన్ కెప్టెన్ గా బెస్ట్ విన్నింగ్ పర్సంటేజ్ దక్కించుకున్నాడు విరాట్.