Samantha: మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసిన సామ్.. ఏమిటో తెలుసా?

స్టార్ బ్యూటీ సమంత తాజాగా ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సమంత తన కెరీర్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓ మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

Samantha: మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసిన సామ్.. ఏమిటో తెలుసా?

Samantha Rejected Three Big Projects

Samantha: స్టార్ బ్యూటీ సమంత తాజాగా ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ముందునుండీ మంచి అంచనాలు క్రియేట్ కావడం, కథ కూడా రిఫ్రెషింగ్‌గా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఇటీవల తన అనారోగ్యం గురించి చెప్పుకొచ్చిన సమంత, తన కెరీర్‌లో ఎవరూ ఊహించని విధంగా ఓ మూడు భారీ ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చింది.

Samantha : యశోద ఫస్ట్ డే కలెక్షన్స్.. పర్వాలేదనిపించిన సమంత.. బ్రేక్ ఈవెన్ అవుతుందా??

ఇంతకీ సమంత రిజెక్ట్ చేసిన ఆ మూడు భారీ ప్రాజెక్టులు ఏమిటో తెలుసా.. అసలు ఆ సినిమాలను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే సమంత రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ నటించిన వైవిధ్యమైన సినిమా ‘ఐ’లో తొలుత హీరోయిన్‌గా సమంతను అనుకున్నారట. అయితే ఆమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇక ఆ తరువాత సుకుమార్ తెరకెక్కించిన మాస్ ఎంటర్‌టైనర్ మూవీ ‘పుష్ప’లో కూడా సామ్‌ను హీరోయిన్‌గా అనుకున్నారట. కానీ, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది.

Samantha : తెలుగు రాష్ట్రాల్లో సమంతకి భారీ కటౌట్స్.. థియేటర్స్ వద్ద సమంత ఫ్యాన్స్ రచ్చ..

అంతేగాక, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’లో కూడా సామ్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చూశారట. కానీ తన పర్సనల్ కారణాల వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఇలా చేతివరకు వచ్చిన మూడు బిగ్ ప్రాజెక్టులను సమంత రిజెక్ట్ చేసిందని తెలిసి, ఆమె అభిమానులు అవాక్కవుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తోంది.