Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

తాజాగా సమంత ముంబైలో సముద్రం ఫేసింగ్ ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సముద్రం ఫేసింగ్ లో ముంబైలో ఓ చోట ఖరీదైన బిల్డింగ్స్ ని కడుతున్నారు. అందులో ఇటీవల ఫ్లాట్స్ చూసిన....

Samantha : బాలీవుడ్‌‌కి మకాం.. ముంబైలో ఇల్లు కొంటున్న సమంత..

Sam

Updated On : April 4, 2022 / 10:30 AM IST

Samantha :  చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్ లో ఎదగాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. మరో పక్క డబ్బులు కూడా బాగా సంపాదించాలని డిసైడ్ అయింది. దీంతో వచ్చిన ప్రతి ఆఫర్ కి ఓకే చెప్తుంది. ఇటీవల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమంత చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు, ఓ తమిళ్, ఓ హిందీ, ఓ హాలీవుడ్ సినిమా, రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి.

వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. సౌత్ హీరోయిన్స్ అంతా బాలీవుడ్ ని టార్గెట్ చేస్తారనే సంగతి తెలిసిందే. సమంత సౌత్ లో స్టార్ హీరోయిన్ అయినా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటుంది. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ సిరీస్, పుష్ప ఐటెం సాంగ్ తో బాలీవుడ్ కి దగ్గరయింది. తాజాగా సమంత చేతిలో ఓ బాలీవుడ్ సినిమాతో పాటు రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరిన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చేలా కనిపిస్తుంది. దీంతో సమంత ముందుగానే ముంబైకి మకాం మార్చేయాలని చూస్తుంది.

 

Yami Gautam : హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. జాగ్రత్త అంటూ ట్విట్టర్లో పోస్ట్

తాజాగా సమంత ముంబైలో సముద్రం ఫేసింగ్ ఫ్లాట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. సముద్రం ఫేసింగ్ లో ముంబైలో ఓ చోట ఖరీదైన బిల్డింగ్స్ ని కడుతున్నారు. అందులో ఇటీవల ఫ్లాట్స్ చూసిన సమంత ఒకటి కొందామని ఫిక్స్ అయిందట. నిర్మాణంలో ఉన్న ఈ ఫ్లాట్ ని దాదాపు 3 కోట్లు పెట్టి కొనుగోలు చేయబోతున్నట్టు సమాచారం. మొత్తానికి సమంత కూడా అందరిలాగే బాలీవుడ్ కి షిఫ్ట్ అవ్వాలని చూస్తుంది.