Samantha : షూటింగ్‌లో సమంతకు తీవ్ర గాయాలు..

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం నార్త్ లో కూడా దుమ్ము దులుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్న సమంతకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Samantha : షూటింగ్‌లో సమంతకు తీవ్ర గాయాలు..

Samantha was seriously injured in the shooting of citadel

Samantha : సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం నార్త్ లో కూడా దుమ్ము దులుపుతుంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి మరో యాక్షన్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ డీకే తెరకెక్కిస్తున్న ‘సిటాడెల’ వెబ్ సిరీస్ లో ప్రస్తుతం సమంత నటిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో సమంత గూఢచారిగా కనిపించబోతుంది. దీంతో భారీ యాక్షన్ సీక్వెన్స్ అండ్ స్టంట్స్ లో సమంత నటించబోతుంది.

Chaitanya – Samantha : 13 ఏళ్ళ ‘ఏ మాయ చేసావె’.. సమంతని గుర్తు చేసుకున్న చైతన్య.. కానీ సమంత మాత్రం!

ఈ క్రమంలోనే యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొన్న సమంతకు తీవ్ర గాయాలు అయ్యాయి. యాక్షన్ సన్నివేశంలో తన చేతికి గాయాలు అయ్యిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఈ గాయాలు యాక్షన్ సీక్వెన్స్ చేయడానికి మరింత ప్రోత్సహిస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు ఈ సిరీస్ కోసం సమంత.. స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, హార్స్ రైడింగ్ నేర్చుకోవడం వంటివి కూడా చేస్తుంది. ఇక ఇటీవలే సమంత అనారోగ్యం నుంచి కోలుకొని తిరిగి షూటింగ్ ల్లో పాల్గొంటుంది. దీంతో ఇప్పుడు ఈ స్టోరీ చూసిన అభిమానులు.. వర్క్ పై ఆమెకు ఉన్న డెడికేషన్ కి హ్యాట్సాఫ్ అంటున్నారు. మరి కొంతమంది అయితే ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు.

ఈ సిరీస్ లో సమంతకు జంటగా బాలీవుడ్ హీరో వరుణ్ ధమాన్ నటిస్తున్నాడు. కాగా ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిస్తోంది. హాలీవుడ్ లో సమంత క్యారెక్టర్ ని ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఇటీవలే హాలీవుడ్ సిటాడెల నుంచి మేకర్స్ ప్రియాంక స్టిల్స్ రిలీజ్ చేయగా, వైరల్ అవుతున్నాయి. త్వరలోనే సమంత లుక్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ సిరీస్ షూటింగ్ పూర్తి అవ్వగానే సమంత, విజయ్ దేవరకొండతో నటిస్తున్న ఖుషి మూవీ షూటింగ్ లో పాల్గొనుంది.