Samyuktha Menon : టాలీవుడ్ లో ఎంట్రీతోనే హ్యాట్రిక్.. వరుస అవకాశాలు పట్టేస్తున్న మలయాళీ కుట్టి..
అందం, అభినయం, నటనతో సంయుక్త మీనన్ అందర్నీ మెప్పిస్తుంది. ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వన్ ఇయర్ లోనే అప్పుడే 5 సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. మరిన్ని క్యూ కడుతున్నాయి.

Samyuktha Menon getting huge offers from Tollywood
Samyuktha Menon : ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మందికి మాత్రమే అతి తక్కువ కాలంలో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కడం, ఆ సినిమాలు మంచి విజయాలు సాధించడం, ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కడం జరుగుతూ ఉంటాయి. పూజా హెగ్డే(Pooja Hegde), రష్మిక(Rashmika), కృతి శెట్టి(Krithi Shetty), శ్రీలీల(Sreeleela).. లాంటి కన్నడ బ్యూటీలు టాలీవుడ్ లో వరుస సినిమాలు పట్టేస్తున్న సమయంలో మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon) వాళ్లకు పోటీ ఇస్తుంది.
అందం, అభినయం, నటనతో సంయుక్త మీనన్ అందర్నీ మెప్పిస్తుంది. ఆమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వన్ ఇయర్ లోనే అప్పుడే 5 సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుంది. మరిన్ని క్యూ కడుతున్నాయి. లాస్టియర్ రిలీజైన పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. రానా భార్యగా ఆమె చేసిన అభినయం ఆడియన్స్ ను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమా సూపర్ హిట్టైంది.
ఆ సినిమా ఇలా రిలీజైందో లేదో వెంటనే కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ మూవీలో హీరోయిన్ గా కనపడి మెప్పించింది. ఈ సినిమా కూడా హిట్ కొట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘సార్’ మూవీలో ధనుష్ జోడీగా నటించి మాస్టారు మాస్టారు అంటూ అందర్నీ అలరించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సంయుక్త టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన మొదటి మూడు సినిమాలు హిట్ అయి హ్యాట్రిక్ రావడంతో టాలీవుడ్ చూపు సంయుక్త మీద పడింది.
Aamir khan : ధూమ్ 4లో అమీర్ ఖాన్? అమీర్ కి ఇప్పుడు హిట్ కావాలంటే ధూమ్ 4 చేయాల్సిందేనా?
ప్రజెంట్ సంయుక్త మీనన్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్షలో నటిస్తోంది. కార్తిక్ దండు డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై కూడా అంచనాలు చాలానే ఉన్నాయి. ఏప్రిల్ 21న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ స్పై అడ్వంచరస్ మూవీ ‘డెవిల్’, బింబిసార 2 సినిమాల్లో కూడా నటిస్తుంది సంయుక్త. ఇవే కాక ఇంకా అనౌన్స్ చేయనివి ఓ రెండు సినిమాలు సంయుక్త చేతిలో ఉన్నాయని సమాచారం. ఇప్పటివరకు చాలా పద్దతిగా, ఓ మోస్తరు క్యారెక్టర్స్ చేస్తూ, సోషల్ మీడియాలో కూడా పద్దతిగా ఫోటోలు పోస్ట్ చేస్తూనే అభిమానులను సంపాదించుకుంటున్న సంయుక్త మరి భవిష్యత్తులో ఏమన్నా బోల్డ్ క్యారెక్టర్స్, బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తుందేమో చూడాలి.